https://oktelugu.com/

Koratala Siva Acharya’ movie : కుట్రపూరితంగానే కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా తీసాడా.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం

Koratala Siva Acharya’ movie : ఈ ఏడాది మెగాస్టార్ అభిమానులకు చేదు అనుభవం ని కలిగించిన సినిమా ‘ఆచార్య’..కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్ చిరంజీవి – రామ్ చరణ్ కాంబినేషన్ ని పెట్టి సినిమాగా తీస్తున్నదంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే..కానీ కొరటాల శివ మాత్రం ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయాడు..ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకొని ఇంత చెత్త సినిమా ఎలా తీసాడు అని ఈ సినిమాని చూసిన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2022 / 09:08 PM IST
    Follow us on

    Koratala Siva Acharya’ movie : ఈ ఏడాది మెగాస్టార్ అభిమానులకు చేదు అనుభవం ని కలిగించిన సినిమా ‘ఆచార్య’..కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్ చిరంజీవి – రామ్ చరణ్ కాంబినేషన్ ని పెట్టి సినిమాగా తీస్తున్నదంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే..కానీ కొరటాల శివ మాత్రం ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయాడు..ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకొని ఇంత చెత్త సినిమా ఎలా తీసాడు అని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది..

    అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం చిరంజీవి అని..కొరటాల శివ ని ప్రశాంతం గా దర్శకత్వం చేసుకోనివ్వకుండా తన ఐడియాస్ ఇస్తూ స్టోరీ మొత్తాన్ని మార్చారని.అందువల్లే ఆచార్య ఔట్పుట్ అంత దరిద్రంగా వచ్చిందంటూ చిరంజీవి దురాభిమానులు చాలా రోజుల నుండి సోషల్ మీడియా లో ఈ విష ప్రచారం చెయ్యడానికి తెగ ప్రయత్నిస్తున్నారు..అయితే ఈ సినిమా షూటింగ్ దగ్గర నుండి బిజినెస్ వ్యవహారాల వరుకు అన్ని కొరటాల శివకి ఇష్టమొచ్చినట్టేనా చేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట.

    అందుకు ఉదాహరణ రీసెంట్ గా ఆ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన మణిశర్మ చేసిన వ్యాఖ్యలే..మణిశర్మ ఆచార్య సినిమాకి మంచి పాటలు అందించాడు..కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్ లో ఇవ్వడంలో సిద్ధహస్తుడైన మణిశర్మ ఆచార్య సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం లో మాత్రం చేతులెత్తేశాడు..దానికి కారణం ముందుగా మణిశర్మ ఈ సినిమా కోసం చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ ని పక్కన పెట్టించి..కొరటాల శివ తనకి ఇష్టమొచ్చినట్టు చేయించుకున్నాడట..ఇక దర్శకత్వం విషయం లో కూడా చిరంజీవి కి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా సమయం లోనే చాలా సన్నివేశాల్లో తేడా కొట్టిందట..మనం 2022 వ సంవత్సరం లో ఉన్నాము..ఇప్పటి ఆడియన్స్ కి ఇలాంటి సన్నివేశాలు నచ్చుతాయా ? అని చిరంజీవి అడిగేవాడట.

    నా మీద నమ్మకం ఉంచు బాస్ అంటూ కొరటాల శివ చిరంజీవి నోరుని నొక్కేసేవాడట.. అలా అనుమానం గానే ఈ సినిమాని పూర్తి చేసిన చిరంజీవి కి మొదటి నుండి ఈ చిత్రం ఫలితం పై డౌట్ ఉండేదట..ఆయన అనుకున్న విధంగానే సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..అలా కొరటాల శివ చెత్త సినిమా చెయ్యాలి అనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాని చేశాడంటూ సోషల్ మీడియా లో మెగా ఫాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు.