https://oktelugu.com/

కేజీఎఫ్ ఏపీ, తెలంగాణ రేటు @ 110 కోట్లు?

భారీ అంచనాలున్న కన్నడ చిత్రం కేజీఎఫ్ 2 ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ బిజినెస్ ను చేసింది. కేజీఎఫ్1 చిత్రం సంచలన విజయాన్ని సాధించడం.. అన్ని భాషల్లోనూ రికార్డులు సొంతం చేసుకోవడంతో ఇప్పుడు రెండో కేజీఎఫ్2 అంతకుమించిన యాక్షన్ తో తీశారు. ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో చిత్రాన్ని కొనుగోలు చేయడానికి అందరూ ఎగబడుతున్నారు. కేజీఎఫ్2 మార్కెటింగ్ కూడా తాజాగా ప్రారంభమైంది. సినిమాను అమ్మకుండా తిరిగి చెల్లించే పద్ధతిలో అడ్వాన్స్ లు తీసుకొని హక్కులు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 20, 2021 / 04:59 PM IST
    Follow us on

    భారీ అంచనాలున్న కన్నడ చిత్రం కేజీఎఫ్ 2 ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ బిజినెస్ ను చేసింది. కేజీఎఫ్1 చిత్రం సంచలన విజయాన్ని సాధించడం.. అన్ని భాషల్లోనూ రికార్డులు సొంతం చేసుకోవడంతో ఇప్పుడు రెండో కేజీఎఫ్2 అంతకుమించిన యాక్షన్ తో తీశారు. ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో చిత్రాన్ని కొనుగోలు చేయడానికి అందరూ ఎగబడుతున్నారు.

    కేజీఎఫ్2 మార్కెటింగ్ కూడా తాజాగా ప్రారంభమైంది. సినిమాను అమ్మకుండా తిరిగి చెల్లించే పద్ధతిలో అడ్వాన్స్ లు తీసుకొని హక్కులు ఇస్తున్నారు. నైజాం ఏరియాను దిల్ రాజు 50 కోట్ల అడ్వాన్స్ లు ఇచ్చి తీసుకున్నట్టు సమాచారం. సినిమా , హిట్ అయినా ఫ్లాప్ అయిన కొన్న వారికి దీంతో సమస్యలు రావు. హిట్ అయితే నిర్మాతలకు పోతాయి. ఫ్లాప్ అయితే తక్కువకే ముట్టజెప్పుతారు. ఈ కోణంలోనే ఈసారి కేజీఎఫ్ బిజినెస్ చేస్తున్నారు.

    ఇక ఆంధ్రాలోనూ అన్ని ఏరియాలు కలిపి రూ.60 కోట్లకు అమ్మినట్లు సమాచారం. తూర్పు గోదావరి హక్కులు మణికంఠ ఫిలింస్ తీసుకున్నట్టు సమాచారం. వైజాగ్ ఏరియాకు సాయి కొర్రపాటి అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ చేస్తున్నారు. సినిమా హిట్ అయితే లాభాలు పంచుతారు. ఫ్లాప్ అయితే బ్లాక్ అయిపోతాయి. సో టెన్షన్ లేకుండా కేజీఎఫ్ ను ఈసారి రిలీజ్ చేస్తున్నారు.

    ఇక కేజీఎఫ్2 కనుక హిట్ అయితే నెక్ట్స్ ప్రభాస్ ‘సలార్’ కూడా వీరికే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. మరి కేజీఎఫ్2 ఏం చేస్తుందనేది చూడాలి.