Kalki 2: మన టాలీవుడ్ లో ఒక సినిమాని వేరే లెవెల్ లో ప్రమోట్ చేయాలంటే రాజమోళి తర్వాతే ఎవరైనా అని అంటుంటారు ట్రేడ్ విశ్లేషకులు. సినిమా తీయడానికి ఆయన రెండేళ్లు , మూడేళ్లు తీసుకుంటే, ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి మూడు నెలల సమయం తీసుకుంటాడని అంటుంటారు. ఈ అంశం లో రాజమౌళి ని కొట్టే డైరెక్టర్ ఎవ్వరూ లేరని నిన్న మొన్నటి వరకు అనుకునేవారు. కానీ ఇప్పుడు నాగ్ అశ్విన్ రాజమౌళి ని మించిన ప్రమోషనల్ స్ట్రాటజీ ని ‘కల్కి 2’ చిత్రం కోసం ఉపయోగించబోతున్నాడు. ‘కల్కి’ చిత్రం విడుదల సమయం లో నాగ్ అశ్విన్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఒక చిన్న వెబ్ సిరీస్ చేసాడు గుర్తుందా?. ప్రభాస్ కి , బుజ్జి కి మధ్య రిలేషన్ ఎలా ఏర్పడింది అనే బ్యాక్ స్టోరీ ని ఈ యానిమేషన్ సిరీస్ లో చూపించాడు.
సరిగ్గా ‘కల్కి 2’ కి కూడా ఇలాంటి యానిమేషన్ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రం లోని క్యారెక్టర్స్ అన్నిటికి సంబంధించిన బ్యాక్ స్టోరీ ని ఒక వెబ్ సిరీస్ లాగా ప్లాన్ చేస్తున్నాడట. ఒక్కో ఎపిసోడ్ నిడివి గంటకు పైగా ఉంటుందని సమాచారం. భైరవ జననం దగ్గర నుండి , సుప్రీమ్ యాస్మిన్ జననం వరకు, ప్రతీ క్యారెక్టర్ కి బ్యాక్ స్టోరీ ని చూపిస్తాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. అశ్వర్దమా బ్యాక్ స్టోరీ కూడా ఉంటుందట. మహాభారతం కాలం నుండి , కాళీ కాలం వరకు ఆయన అనుభవించిన నరకం , సమాజం లో జరిగే దుర్మార్గాలను చూసి కుమిలిపోవడం వంటివి ఈ సిరీస్ లో చూపిస్తారట. అదే విధంగా కల్కి కి జన్మనిస్తున్న ‘SUM 30’ కి సంబంధించిన బ్యాక్ స్టోరీ చాలా గట్టిగా పేలుతుందట.
ఇవన్నీ వెబ్ సిరీస్ లో చూపిస్తే , ‘కల్కి’ సిరీస్ కి ఆడియన్స్ మరింత గట్టిగా కనెక్ట్ అవుతారని, బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా ఎక్కువ అద్భుతాలను నెలకొల్పుతుందని బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే రీసెంట్ గానే ఈ చిత్రం మొదలై రెండు కీలక షెడ్యూల్స్ ని పూర్త చేసుకుంది. సెప్టెంబర్ నెల నుండి నాన్ స్టాప్ గా విరామం లేకుండా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని అంటున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ చిత్రం నుండి దీపికా పదుకొనే తప్పుకోగా , ఇప్పుడు ఆమె స్థానం లోకి అలియా భట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
