Jr NTR Struggling In One Aspect: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైన కథాంశం ఉంటుంది. ఆయన ప్రతి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి ఉన్నప్పటికి ప్రస్తుతం కొంతవరకు తడబడుతున్నాడు. తన తోటి ఆర్టిస్టులందరు తనకంటే ముందే దూసుకు వెళ్తుంటే ఆయన మాత్రం పాన్ ఇండియాలో పెను సంచలనాలను సృష్టించడానికి చాలా వరకు ఇబ్బంది పడుతున్నాడు…తన కథల విషయంలో ఆయన చాలా క్లారిటీని మైంటైన్ చేయలేకపోతున్నాడు. భారీ కథను ఎంచుకొని దానిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయగలిగే దర్శకులతో అతను సినిమాలను చేయలేకపోతున్నాడు.
మొత్తానికైతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ భారీ సినిమాలను హ్యాండిల్ చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు కావడం వల్ల ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గ కథ కుదురుతుందా? లేదంటే ప్రశాంత్ నీల్ ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఒక్కటి కూడా వెయ్యికోట్ల సినిమా లేకపోవడం వల్ల అతని అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన నుంచి వచ్చే సినిమాలేవీ 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం లేదు. దాంతో తన అభిమానులు సైతం ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా విషయంలో క్లారిటిని మెయింటైన్ చేస్తున్నప్పటికి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందనే విషయాన్ని మాత్రం ప్రేక్షకులకు తెలియజేయడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక్కటి కూడా అప్డేట్ రాకపోవడంతో అసలు సినిమా షూట్ నడుస్తుందా? లేదంటే ఆగిపోయిందా అనే విషయాలు కూడా ఎవరికీ అర్థం కావడం లేదు…