US Iran War: ఇరాన్ దేశంతో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇదే విషయాన్ని అమెరికన్ కాంగ్రెస్ లో వెల్లడించారు. దీంతో యావత్ ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. వాస్తవానికి అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ప్రపంచం ఎప్పుడో అంచనా వేసింది. ఈ యుద్ధం వల్ల అమెరికా ఏం సాధించింది.. ఇరాన్ దేశం పై ఎలాంటి ఎత్తుగడ అనుసరించింది.. అనే విషయాలను పక్కన పెడితే.. ఇప్పుడు అమెరికా చేస్తున్న పని యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది.
సాధారణంగా అమెరికా అనేది ఒక పెట్టుబడిదారీ దేశం. అక్కడ రకరకాల వ్యవస్థలు ఉంటాయి. అన్ని వ్యవస్థలు కూడా ప్రపంచం మీద పెత్తనం సాగించేందుకు ఆసక్తిని చూపిస్తుంటాయి. అందువల్లే అమెరికా లోని వ్యవస్థలు ప్రపంచానికి అవసరాలను సృష్టిస్తాయి. ఆ అవసరాలు తీర్చే బాధ్యతలను అమెరికా కంపెనీలు తీసుకుంటాయి. తద్వారా సప్లై డిమాండ్ సూత్రాన్ని అనుసరిస్తుంటాయి. చివరికి లేని అవసరాన్ని సృష్టించి.. ఆ అవసరాన్ని తీర్చే మార్గాన్ని ఆ కంపెనీలు అనుసరించి.. చివరికి డబ్బులు వసూలు చేస్తుంటాయి. దీనిని బట్టి అమెరికా ఎలాంటి దేశమో.. అక్కడ ఉన్న వ్యవస్థలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.
ఇరాన్ దేశంతో సాగిన యుద్ధాన్ని బ్రేక్ చేసిన అమెరికా.. ఇప్పుడు ఏకంగా తన ఆయుధాలను అమ్ముకునే పనిని మొదలుపెట్టింది. ఖతార్, యూఏఈ, కువైట్, ఇజ్రాయిల్ దేశాలకు దాదాపు 85 వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను అమ్మడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఆయుధాలను వెంటనే ఆయా దేశాలకు పంపించే ఏర్పాటు చేస్తోంది.. యుద్ధ భయాలను క్రియేట్ చేసి.. ఆయుధాలు అమ్ముకోవడమే అగ్రరాజ్యం అజెండా అని గతంలో అనేక దేశాలు ఆరోపించాయి. ఆ ఆరోపణలను అమెరికా అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.
ఇటీవల ఇరాన్ దేశంతో జరిగిన యుద్ధంలో అమెరికా భారీగానే ఆయుధాలను నష్టపోయింది. యుద్ధ విమానాలను కోల్పోయింది. ఆర్థికంగా ఒత్తిడి వాతావరణం ఎదుర్కొంటున్నది. అయినప్పటికీ యుద్దం విషయంలో అమెరికా నిన్న మొన్నటి వరకు వెనకడుగు వేయలేదు. అయితే ఇప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిన నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత అమెరికా ఆర్థిక పరిస్థితి కాస్త కోలుకుంటుదని నిపుణులు అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలుస్తోంది.