Jr NTR Devara : జూ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా దేవర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి గ్లోబల్ స్టార్ అయిన ఎన్టీఆర్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు కూడా. ఇక ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అంశం సినిమాపై అంచనాలను పెంచుతూనే ఉంది.
ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని..తారక్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా టీమ్ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు కొత్త పోస్టర్ లో టైటిల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంతో పాటు సినిమాకు సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టేలా చేయడం విశేషం.
దేవర టైటిల్ లోనే అసలు కథ కనిపిస్తుంది. ప్రారంభంలో దేవర టైటిల్ ప్లెయిన్ గా ఉంది అనుకున్నారు. కానీ నిన్న కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లో ఓ రహస్యాన్ని బయటపెట్టారు. టైటిల్ దేవర అని తెలిసిందే. ఇందులోని వర రెడ్ కలర్ తో ఉంది. అంతేకాదు ఈ సందర్భంగా మరో అప్డేట్ ఈ కలర్ ని హైలెట్ చేయడం వెనుక రహస్యాన్ని ఛేదిస్తుందట. ఇక ఈ సారి ఎన్టీఆర్ కొత్త లుక్ ను పంచుకున్నారు మేకర్స్. ఇందులో ఎన్టీఆర్ యంగ్ గా కనిపిస్తున్నాడు.
గతంలో విడుదల చేసిన లుక్ లో ఎన్టీఆర్ పెద్దగా కనిపించాడు. ఇదే ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెడుతుందట. అయితే ప్రారంభంలో వచ్చిన ఎన్టీఆర్ లుక్ తండ్రి పాత్రకు సంబంధించినది అని.. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన లుక్ కొడుకుకు సంబంధించినది అంటూ టాక్. తండ్రి దేవరగా కనిపిస్తే.. కొడుకు వరగా కనిపించబోతున్నారన్నమాట. సముద్రపు పోర్ట్ బ్యాక్ డ్రాప్ లోనే కథ సాగబోతుందట. ఇందులో తండ్రి పాత్ర పోర్ట్ ని నిర్మిస్తుందని.. దాన్ని ప్రత్యర్థుల నుంచి అక్కడ అక్రమాలు జరగకుండా చూసే పాత్ర వర చూసుకుంటారని టాక్. మరి చూడాలి కథ ఎలా ఉండబోతుందో..