https://oktelugu.com/

Rajamouli Mahesh Babu: మహేష్ బాబు విషయంలో రాజమౌళి తప్పు చేస్తున్నాడా?

Rajamouli Mahesh Babu: రాజమౌళి సినిమా అంటేనే హీరోలు అంకితం కావాలి. ప్రభాస్ అలాగే ‘బాహుబలి’ రెండు సినిమాల కోసం ఐదారేళ్లు లాక్ అయిపోయారు. ఇక రాంచరణ్, ఎన్టీఆర్ లు మూడేళ్ల పాటు ‘ఆర్ఆర్ఆర్’కే పరిమితం అయ్యారు. రాజమౌళి సినిమాలో హీరోలు ప్రతీ ఫ్రేములో ఉంటారు. దాదాపు 90శాతం కథ వారి చుట్టే తిరుగుతుంది.అందుకే హీరోలను లాక్ చేసేస్తుంటాడు జక్కన్న. రాంచరణ్ ను చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో నటింపచేయడానికి కూడా చాలా ఆలోచించాడట.. అలా రాజమౌళి హీరో […]

Written By:
  • NARESH
  • , Updated On : June 27, 2022 / 08:07 PM IST
    Follow us on

    Rajamouli Mahesh Babu: రాజమౌళి సినిమా అంటేనే హీరోలు అంకితం కావాలి. ప్రభాస్ అలాగే ‘బాహుబలి’ రెండు సినిమాల కోసం ఐదారేళ్లు లాక్ అయిపోయారు. ఇక రాంచరణ్, ఎన్టీఆర్ లు మూడేళ్ల పాటు ‘ఆర్ఆర్ఆర్’కే పరిమితం అయ్యారు. రాజమౌళి సినిమాలో హీరోలు ప్రతీ ఫ్రేములో ఉంటారు. దాదాపు 90శాతం కథ వారి చుట్టే తిరుగుతుంది.అందుకే హీరోలను లాక్ చేసేస్తుంటాడు జక్కన్న. రాంచరణ్ ను చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో నటింపచేయడానికి కూడా చాలా ఆలోచించాడట..

    అలా రాజమౌళి హీరో తను తీయబోయే సినిమాకే అంకితం కావాలన్నది రూల్. ఆ లుక్, మేనరిజం, సహా ఏదీ బయటపడకుండా ఇలా చేస్తుంటాడు. సినిమా విషయంలో లీకులు బయటకు రానీయడు. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబుతో తర్వాత సినిమా విషయంలో రాజమౌళి ఈ రూల్ ను పాటించడం లేదని మహేష్ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు.

    మహేష్ బాబు కోసం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఒక యాక్షన్, అడ్వంచర్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కథ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. అయితే మహేష్ ను ఈ సినిమా కోసం సరికొత్త లుక్ లోకి రాజమౌళి మార్చేయబోతున్నాడట..

    అయితే మహేష్ బాబు ప్రస్తుతం ‘త్రివిక్రమ్’ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నాడు. అది పూర్తి చేసి రాజమౌళి సినిమాకు షిఫ్ట్ కావాల్సి ఉంది. డిసెంబర్ లోపే రాజమౌళి మూవీ మొదలవుతుంది. కానీ ఇప్పటికీ త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కలేదట.. మహేష్ తో త్రివిక్రమ్ మూవీ ఆలస్యం అయితే రాజమౌళి ఎదురుచూడలేదు. రాజమౌళితో సినిమా అనేది మహేష్ కల. ఇది త్రివిక్రమ్ వల్ల దూరం కాకూడదని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ ను త్రివిక్రమ్ కు వదిలిపెట్టి ఆ సినిమా వరకూ రాజమౌళి వదిలిపెట్టి పెద్ద తప్పు చేశాడని అంటున్నారు. త్రివిక్రమ్ ఆ సినిమాను ఇప్పట్లో పూర్తి చేయడని.. ఇంకా కథ కూడా సరిగాలేదని ప్రచారం సాగుతోంది. మరి త్రివిక్రమ్ వల్ల రాజమౌళి సినిమా ఆలస్యం కాకూడదని అందరూ అనుకుంటున్నారు. రాజమౌళి ‘త్రివిక్రమ్’ సినిమా విషయంలో తప్పు చేశాడా? అన్న ఆందోళన మహేష్ ఫ్యాన్స్ లో కలుగుతోంది.