https://oktelugu.com/

నెటిజన్ల ట్రోలింగ్: చైతన్య-సమంత విడాకులకు కారణం అతడేనా?

సమంత-నాగచైతన్యల మూడేళ్ల వివాహ బంధానికి తెరపడింది.  గత కొంతకాలంగా వీరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నా అవి నిజం కాదంటూ అభిమానులు అనుకున్నారు. కానీ వాటినే నిజం చేస్తూ ఇక వైవాహిక బంధాన్ని కొనసాగించలేమంటూ సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరూ విడాకుల ప్రకటన చేయడం సంచలనమైంది. ‘ఏంమాయ చేశావే’ సినిమా సమయం నుంచి దాదాపు పదేళ్ల పాటు కలిసి ఉన్న వీళ్లు భార్యాభర్తలుగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఈ జంట విడిపోవడానికి అంత బలమైన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2021 / 09:11 PM IST
    Follow us on

    సమంత-నాగచైతన్యల మూడేళ్ల వివాహ బంధానికి తెరపడింది.  గత కొంతకాలంగా వీరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నా అవి నిజం కాదంటూ అభిమానులు అనుకున్నారు. కానీ వాటినే నిజం చేస్తూ ఇక వైవాహిక బంధాన్ని కొనసాగించలేమంటూ సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరూ విడాకుల ప్రకటన చేయడం సంచలనమైంది.

    ‘ఏంమాయ చేశావే’ సినిమా సమయం నుంచి దాదాపు పదేళ్ల పాటు కలిసి ఉన్న వీళ్లు భార్యాభర్తలుగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఈ జంట విడిపోవడానికి అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయా? అని పలువురు ఆరా తీస్తున్నారు.

    సమంత నటించిన మూవీలే వీరు విడిపోవడానికి కారణమంటారు. ఇక బోల్డ్ గా కనిపించడం.. ఆ సీన్లలో నటించడం వీరి వివాహ బంధానికి ఎసరు తెచ్చిందని అంటారు. అదే కాదు సమంత నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్2’ చిత్రంలో బోల్డ్ సీన్లలో నటించడం కూడా వీరి బ్రేకప్ కు ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇవేకాకుండా గతంలో సమంత తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ అనే వ్యక్తి కాళ్లు పెట్టుకొని ఫొటో దిగడం.. మల్దీవుల్లో బికినీలో కనిపించడం పెద్ద దుమారాన్ని రేపాయి. ఎంత క్లోజ్ అయినా ఇలా సమంత పెళ్లి అయ్యాక ఒక భార్యగా ఉండి అలా పర్సనల్ డిజైనర్ మీద అంత చనువుగా కాళ్లు పెట్టుకొని ఫొటో దిగడం అభిమానులకు అంతగా నచ్చలేదు. ట్రోల్ చేశారు. దీంతో సమంత వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

    ఈ క్రమంలోనే సమంత -నాగచైతన్య విడాకులకు ప్రీతమ్ జుకల్కరే కారణం అంటూ నెటిజన్లు అతడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి తోడు విడాకుల గురించి ప్రకటన రాగానే ప్రీతమ్ చేసిన పోస్టులు కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తుంది.. దీంతో అతడి ఇన్ స్టాగ్రామ్ కు వెళ్లి పాత పోస్టులకు వెళ్లి మరీ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరికీ ప్రీతమ్ ఘాటుగానే బదులిచ్చినా ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. అయితే నిజానికి ప్రీతమ్ సమంతను జీజీ అని పిలుస్తాడు.. అయినా నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తుండడంతో చేసేదేమీ లేక ప్రీతమ్ తన కామెంట్ సెక్షన్ ను డిజేబుల్ చేసేశాడు.