https://oktelugu.com/

ఇంట్రస్టింగ్: పవన్ సినిమా.. అసలు కథ వినలేదా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. వరుసగా నాలుగైదు సినిమాలకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. పవన్ రీ ఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ ఇప్పటికే దాదాపు 80శాతం పూర్తయింది. కరోనాతో ఈ మూవీ షూటింగు వాయిదాపడగా ఇటీవల హైదరాబాద్లో మళ్లీ ప్రారంభమైంది. Also Read: టాలీవుడ్ లో మరో పెద్ద స్టూడియో.. అల్లు అరవింద్ సంచలనం ఈ మూవీతోపాటు పవన్ కల్యాణ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 07:19 PM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. వరుసగా నాలుగైదు సినిమాలకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. పవన్ రీ ఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ ఇప్పటికే దాదాపు 80శాతం పూర్తయింది. కరోనాతో ఈ మూవీ షూటింగు వాయిదాపడగా ఇటీవల హైదరాబాద్లో మళ్లీ ప్రారంభమైంది.

    Also Read: టాలీవుడ్ లో మరో పెద్ద స్టూడియో.. అల్లు అరవింద్ సంచలనం

    ఈ మూవీతోపాటు పవన్ కల్యాణ్ డైరెక్టర్లు క్రిష్.. హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డిలతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాల తర్వాత త్రివిక్రమ్.. బండ్ల గణేష్ తో మూవీలు చేస్తాడనే టాక్ విన్పిస్తోంది. వీటిలో పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో వచ్చే సినిమాలపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    వీరిద్దరి కాంబినేషన్లలో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఇటీవల పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించి పోస్టర్ ను దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశాడు. కేవలం ఓ బైక్.. దానిపై ఓ గులాబీ పువ్వును చూపించాడు. పవన్ ను అభిమానులు ఇంతకముందు ఎన్నడూ చూడనివిధంగా చూస్తారంటూ హరీష్ శంకర్ చెప్పడంతో అభిమానులు ఖుషీ అయ్యారు.

    అయితే ఈ సినిమా కథను ఇప్పటివరకు పవర్ స్టార్ కు హరీష్ శంకర్ విన్పించలేదని తెలుస్తోంది. కేవలం కాన్సెస్ట్ ఆధారంగా ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశాడని అందుకే పవన్ కల్యాణ్ ఈ సినిమాపై స్పందించలేదని గాసిప్స్ విన్పిస్తున్నాయి. ఈ మూవీలో పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో మాదిరిగానే పోలీస్ గెటప్ లో కన్పిస్తాడని టాక్ విన్పిస్తోంది.

    Also Read: గల్లీబాయ్స్ తో శ్రీముఖి రచ్చ !

    అయితే తాజాగా గతంలో హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘మిరపకాయ్’ మూవీకి సిక్వెల్ గా ఈ మూవీ రాబోతుందనే గాసిప్స్ విన్పిస్తోంది. ఈ మూవీలో రవితేజ కూడా పోలీస్ ఆఫీసర్ కావడం విశేషం. దీంతో మిరపకాయ కథనే హరీష్ శంకర్ కొత్తగా చూపించబోతున్నాడని ఫిల్మ్ నగర్లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీపై రకరకాల గాసిప్స్ పుట్టుకొస్తుండటంతో దర్శకుడు సినిమాపై ఏదైనా క్లారిటీ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే..!