spot_img
Homeఆంధ్రప్రదేశ్‌జనసేనాని ప్రజల్లోకి రాకపోవడమేంటి..?

జనసేనాని ప్రజల్లోకి రాకపోవడమేంటి..?

ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా పాత్ర పోషించాలి. ఎన్నో సిద్ధాంతాలతో పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించారు. అదే లక్ష్యంతో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక ఆ ఫలితాలు అందరికీ తెలిసిందే. ఆ ఫలితాల తర్వాత కొద్ది రోజుల పాటు రాష్ట్రాన్ని అంటిపెట్టుకుని ఉన్న జనసేనాని.. ఆ తర్వాత హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. కరోనా టైంలోనూ పెద్దగా స్పందించలేదు. ఇటీవల వరదలు వచ్చినా రాష్ట్రానికి చేరుకోలేదు. అటు పంటలూ మునిగిపోయాయి.

Also Read: బ్రేకింగ్: 6 గంటలకు ప్రజల ముందుకు మోడీ.. ఏం చెప్తారు?

మరోవైపు మరికొద్ది రోజుల్లో పవన్‌ కల్యాణ్‌ సినిమా షూటింగ్‌ల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ షూటింగ్ తాజా షెడ్యూల్ మొదలు పెట్టుకోవాలని, తాను కచ్చితంగా హాజరవుతానని భరోసా ఇచ్చారు పవన్. దీంతో నిర్మాత దిల్ రాజు చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చాతుర్మాస దీక్ష పూర్తవుతున్న సందర్భంలో పవన్ తొలిసారి సినిమా షూటింగ్‌లోనే అడుగు పెట్టబోతున్నారు.

అయితే.. రాజకీయ పార్టీ పెట్టి ప్రజల సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉన్నా పవన్‌ కల్యాణ్‌ కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్రానికి రాకపోయినా.. కనీసం హైదరాబాద్‌లోని ప్రజలనైనా పరామర్శించవచ్చు. కానీ.. జనాల్లోకి ఆయన ఎందుకు వెళ్లడం లేదో తెలియకుండా ఉంది. పోనీ పవన్ అన్నింటికీ దూరంగా ఉన్నారంటే అదీలేదు. సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. లాక్‌డౌన్ కాలంలోనే పవన్ కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రేపో మాపో షూటింగ్‌కు సై అంటున్నారు. సినిమాలంటే అంత ఉత్సాహం ఉన్న పవన్‌కు, రాజకీయాలంటే పెద్దగా నచ్చడం లేదా అని అందరిలోనూ ప్రశ్న వస్తోంది.

Also Read: ఏపీ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే ఉల్లిపాయలు..?

కాపు రిజర్వేషన్లపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసిన పవన్.. అసలు తనకు సినిమాలు ఇష్టమా, రాజకీయాలు ఇష్టమా అనే విషయంపై ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు. షూటింగ్‌లకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్న జనసేనాని, జనంలోకి రావడానికి ఎందుకు జంకుతున్నారు? పవన్ ఫస్ట్ ప్రయారిటీ సినిమాలేనా? ప్రజలకు చెప్పకపోయినా కనీసం జనసైనికులకైనా చెబితే.. వారికి ఓ క్లారిటీ వస్తుంది కదా. ఇలా రెండు పడవల విధానాన్ని పాటిస్తే.. అటు ప్రజల్లోనూ పార్టీకి మైలేజీ పోక తప్పదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper