Heroine Nayanthara Goodbye to movies.. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనే టాగ్ వింటే మనకి వెంటనే గుర్తు వచ్చే పేరు నయనతార..అందం ఉంది క్రేజ్ ఉంది కదా అని డబ్బుల కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యదు ఈమె..నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రమే చేస్తుంది..హీరోయిన్స్ కేవలం హీరో తో డ్యూయెట్స్ వేసుకోవడానికి మాత్రమే పనికొస్తారు అని అంటున్న ఈరోజుల్లో నయనతార నటన కి ఫుల్ స్కోప్ ఉన్న పాత్రలు మరియు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకుంది.

అయితే ఈమెకి ఇండస్ట్రీ లో అఫైర్స్ మరియు కాంట్రవర్సీలు చాలా ఎక్కువే..శింబు , ప్రభుదేవా వంటి వారితో ప్రేమాయణం నడిపిన నయనతార చివరికి ప్రముఖ దర్శకుడు సతీష్ విగ్నేష్ ని ప్రేమించి 5 నెలల క్రితం పెళ్లాడింది..అయితే ‘సరోగసి’ ద్వారా ఇద్దరు కవలపిల్లలకు తల్లై టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది నయనతార..’సరోగసి’ పద్దతి ఇండియాలో చట్టరీత్యా నేరం.
ప్రస్తుతం నయనతార ఆ కేసులోనే చిక్కుకొని సమస్యలను కొని తెచ్చుకుంది..ఇదంతా పక్కన పెడితే సమంత తీసుకున్న మరో నిర్ణయం ఆమె అభిమానులను తీవ్రమైన నిరాశకి గురయ్యేలా చేస్తుంది..అదేమిటి అంటే ఇక మీదట ఆమె సినిమాలు చెయ్యడట..ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి ఇక శాశ్వతంగా నటనకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉందట..ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో షారుక్ ఖాన్ హీరో గా నటిస్తున్న జవాన్ లో హీరోయిన్ గా నటిస్తుంది..దీనితో పాటుగా తమిళం లో మాధవన్ తో ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకుంది..ఈ రెండు సినిమాల తర్వాత ఆమె సినిమాలకు దూరబోతున్నట్టు సమాచారం..ఇటీవలే ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం లో చిరంజీవి కి చెల్లెలుగా నటించింది.
అంతకు ముందు ఈమె మెగాస్టార్ చిరంజీవి ‘సై రా నరసింహ రెడ్డి’ చిత్రం లో ఆయనకీ జోడిగా హీరోయిన్ గా నటించింది..సాధారణంగా అలా హీరోయిన్ గా చేసి మళ్ళీ అదే హీరో కి చెల్లెలుగా చెయ్యడానికి ఎవ్వరు ఒప్పుకోరు..కానీ నయనతార ఒప్పుకొని చేసింది..ఇలా వైవిధ్యమైన నిర్ణయాలతో థ్రిల్ కి గురి చేసే పత్రాలు చేస్తున్న నయనతార ఇక మీదట సినిమాలు చెయ్యబోదు అనే వార్త ఆమె అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేస్తుంది.