Heroine Laya – Balakrishna : షాకింగ్..బాలయ్య కాలుని తొక్కినందుకు హీరోయిన్ లయ కి అలాంటి గతి పట్టించారా! కన్నీళ్లు రప్పిస్తున్న లయ కామెంట్స్

  Heroine Laya-  Balakrishna : అందం తో పాటుగా అభినయం కూడా చక్కగా చూపించగలిగా అతి కొద్దీ మంది స్టార్ హీరోయిన్స్ లో లయ ఒకరు.బాలనటిగా పలు సినిమాల్లో నటించిన లయ, ఆ తర్వాత వేణు తొట్టెంపూడి హీరో గా నటించిన ‘స్వయంవరం’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమై, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి, సుమారుగా 50 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత గణేష్ అనే అతనిని […]

Written By: NARESH, Updated On : March 2, 2023 10:29 pm
Follow us on

 

Heroine Laya-  Balakrishna : అందం తో పాటుగా అభినయం కూడా చక్కగా చూపించగలిగా అతి కొద్దీ మంది స్టార్ హీరోయిన్స్ లో లయ ఒకరు.బాలనటిగా పలు సినిమాల్లో నటించిన లయ, ఆ తర్వాత వేణు తొట్టెంపూడి హీరో గా నటించిన ‘స్వయంవరం’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమై, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి, సుమారుగా 50 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత గణేష్ అనే అతనిని పెళ్ళాడి సినిమాలకు దూరమైంది.

ఆమెకి పెళ్ళైన సమయంలోనే ఏడాదికి ఆరు సినిమాల్లో హీరోయిన్ గా చేసేంత స్టార్ స్టేటస్ ఉండేది,కానీ పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడానికి ఇష్టపడలేదు.ఇది ఇలా ఉండగా మీడియా తో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడని లయ ఈమధ్యనే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన సినీ కెరీర్ గురించి తనతో కలిసి పని చేసిన స్టార్ హీరోల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పింది.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ నుండి తనకి ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది లయ.ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది.ఆమె మాట్లాడుతూ ‘బాలయ్య బాబు తో నేను చెన్నకేశవ రెడ్డి అనే సినిమా చెయ్యాల్సి ఉంది, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నాను.మళ్ళీ అదే బాలయ్య తో విజయేంద్ర వర్మ సినిమా చేశాను.షూటింగ్ సమయం లో మేమిద్దరం ఒక సాంగ్ చెయ్యాల్సి ఉంది.అందుకు సంబంధించిన రిహార్సల్స్ చేస్తూ ఉన్నాము.ఒకరోజు అనుకోకుండా నా వెనుక ఉన్న బాలయ్య గారి కాళ్ళను చూసుకోకుండా తొక్కేసాను.బాలయ్య గారు వెంటనే కోపం తో షూటింగ్ కి ప్యాకప్ అని గట్టిగా అరిచారు.బాలయ్య కి కోపం ఎక్కువ అని విన్నాను కానీ, ఇంత కోపం అని నాకు తెలియదు.నా వల్ల ఒక రోజు షూటింగ్ వేస్ట్ అయ్యింది అని చాలా బాధపడ్డాను.తర్వాత బాలయ్య నా దగ్గరకి వచ్చి ఏమనుకోకు, సరదాగా అన్నాను లే అని అన్నాడు.నన్ను నవ్వించడానికి ఆరోజు ఆయన చాలా జోకులు కూడా వేసాడు’ అంటూ చెప్పుకొచ్చింది లయ.