Rajendra Prasad meets Pawan Kalyan: ప్రముఖ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) నేడు మంగళగిరి లోని క్యాంపు ఆఫీస్ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఒకసారి భేటీ అయిన రాజేంద్ర ప్రసాద్, ఇప్పుడు రెండవసారి కూడా భేటీ అవ్వడం గమనార్హం. రీసెంట్ గానే ఆయనకు పద్మశ్రీ అవార్డు రాగా, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి మరీ అభినందించాడు. పవన్ కళ్యాణ్ కూడా అలా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియచేస్తాడని అనుకుంటే, రాజేంద్ర ప్రసాదే పవన్ కళ్యాణ్ ని కలవడమే వింతగా ఉంది. కలవడమే కాకుండా , ప్రత్యేకంగా రాజేంద్ర ప్రసాద్ పవన్ ని సత్కరించాడు. ఇదంతా పద్మశ్రీ వచ్చిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేయాల్సిన పనులు. చూస్తుంటే పవన్ కళ్యాణ్ స్వయంగా కేంద్ర పెద్దలకు పద్మ అవార్డ్స్ లో రాజేంద్ర ప్రసాద్ పేరు ఉండేలా కృషి చేసినట్టు తెలుస్తోంది.
అందుకే పవన్ కళ్యాణ్ ని కలిసి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపి ఉంటాడేమో అని కొందరు అంటున్నారు. హైదరాబాద్ లో ఉండే రాజేంద్ర ప్రసాద్, రెండుసార్లు పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా వచ్చి కలవడానికి కచ్చితంగా ఆయనకు ఎదో ముఖ్యంమైన పని పవన్ తో పడి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ, సోషల్ మీడియా లో ఇలాంటి కథనాలు రోజుకి ఒకటి వస్తూనే ఉంటుంది. దీనికి రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి. లెజండరీ నటుడిగా, ఎన్నో అద్భుతమైన సినిమాల్లో హీరో గా నటించి సంచలన విజయాలను అందుకున్నాడు. నిన్నటి తరం ప్రేక్షకులను తన కామెడీ జానర్ సినిమాలతో అలరించడమే కాకుండా, నేటి తరం ప్రేక్షకులను కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన అద్భుతమైన నటనతో అలరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. వాస్తవానికి రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినీ కళామ్మ తల్లికి చేసిన సేవలకు పద్మశ్రీ అనే అవార్డు చాలా చిన్నది. 20 ఏళ్ళ క్రితమే ఆయనకు ఈ గౌరవం దక్కాల్సి ఉంది. చాలా ఆలస్యం అయ్యింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రముఖ నటులు శ్రీ రాజేంద్రప్రసాద్ గారు ఈ రోజు సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన నేపథ్యంలో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రివర్యులతో భేటీ అయ్యారు. ఈ… pic.twitter.com/rYLwzA8UFs
— Kakinada Talkies (@Kkdtalkies) February 4, 2026