Family Star – Devara : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న’ ఫ్యామిలీ స్టార్ ‘ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. గీత గోవిందం తర్వాత డైరెక్టర్ పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కింది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ చెప్పిన ‘ మగతనం చూపించాలి అంటే ఐరనే వంచాలా ఏంటి ‘ అనే డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
నిజానికి ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో పాటు థియేటర్స్ సమస్య నేపథ్యంలో వాయిదా వేశారు. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేసారు. అయితే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ అదే రోజు రాబోతుందని ఎప్పుడో టీం ప్రకటించారు. ఇప్పుడు ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ వస్తుండటంతో దేవర పోస్ట్ పోన్ అయినట్లు అంతా అనుకుంటున్నారు.
ఎందుకంటే దిల్ రాజు ఒక్క సారి డేట్ అనౌన్స్ చేస్తే అందులో మార్పు ఉండదు. గతంలో దిల్ రాజు ఏప్రిల్ 5న దేవర రాకపోతే కనుక అదే డేట్ న ఫ్యామిలీ స్టార్ ని తీసుకొస్తాం అని చెప్పాడు. ఇక అందుకు తగ్గట్లే విజయ్ మూవీ ని అనౌన్స్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే దేవర వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఇక దేవర తప్పుకోవడంతో ఆ స్థానంలో ఫ్యామిలీ స్టార్ రానుంది.
చాలా కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం విజయ్ దేవరకొండ ఎదురు చూస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ వంటి డిజాస్టర్ల తర్వాత గత ఏడాది వచ్చిన ఖుషి కాస్త ఊరటనిచ్చింది. కానీ, అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో హిట్ అందుకోవాలని విజయ్ దేవరకొండ కసితో ఉన్నాడు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఫ్యాన్స్ లో కూడా మూవీ చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.