NTR – Laxmi Pranathi : సినిమా ఇండస్ట్రీ లో 18 సంవత్సరాలకే హీరో గా మారి, 20 సంవత్సరాల వయసు లో స్టార్ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని, గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెబుతూ ఫేస్ లో అన్ని హావభావాలను పలికిస్తు ప్రేక్షకుడికి నచ్చేలా వాళ్ళని మెప్పించేలా నటించి వాళ్ల చేత విజిల్స్ వేయించిన నటుడు జూనియర్ ఎన్టీయార్…
ఇండస్ట్రీ లో హీరోలు వేరు, నటులు వేరు. నటులు హీరోలు అవ్వచ్చు కానీ హీరో లు మంచి నటులు అవ్వలేరు.సినిమాల సక్సెస్ ను బట్టి హీరోలు గా స్టార్ హీరోలు గా మారుతారు కానీ నటులు అలా కాదు వాళ్ళు సినిమాలో కనబరిచిన నటనని బట్టి మంచి నటులు అవుతారు…ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలే ఉన్నారు తప్ప మంచి నటులు లేరు కానీ ఏ క్యారెక్టర్ లో అయిన అలవోకగా నటించి మెప్పిస్తూ ప్రతి క్యారెక్టర్ ని ఓన్ చేసుకొని ఈ క్యారెక్టర్ అతడు తప్ప ఇంకొకరు చేయలేరు అనేంత మ్యాజిక్ ని చేయగలిగేలా నటించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్స్ హిట్స్ గా నిలిచాయి. అలాగే ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీయార్ భార్య అయిన లక్ష్మీ ప్రణతి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.ఇంట్లో ఒక హీరో ఉంటే ఇంట్లో వాళ్ళందరూ అతన్నే అభిమానిస్తు,ఎక్కువగా ఆయన సినిమాలే చూస్తారు కానీ లక్ష్మి ప్రణతి దానికి బిన్నంగా ఉన్నారు. లక్ష్మీ ప్రణతికి ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ కాదట ఆమె కి ఫేవరెట్ హీరో వేరే వాళ్ళు ఉన్నారట ఆమె ఎప్పుడూ ఆ హీరో సినిమాలే ఎక్కువగా చూస్తారట ఆ హీరో ఎవరంటే సీనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం. ఇక ఇప్పటికి కూడా ఆమె కి సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆమె పెద్దగా సినిమాలు చూడదు అంటా,కానీ ఒకవేళ సినిమాలు చూడాల్సి వస్తే సమయం దొరికినప్పుడల్లా సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తారట ఒక వేళ ఇంకా చూడాలి వస్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చుస్తుందంట అంతే తప్ప ఆమె పెద్దగా సినిమాలు చూడదట.
ఆమె ఎప్పుడూ పిల్లలను చూసుకుంటూ బిజీగా ఉంటుంది. వీళ్లకి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు…వీళ్ళ ని చూసుకోవడానికి తనకి రోజు మొత్తం గడిచిపోతుంది అంటూ ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీయార్ చెప్పడం జరిగింది…ఇక ఇది ఇక ఉంటే ఎన్టీయార్ కొరటాల తో చేస్తున్న దేవర సినిమా సూపర్ సక్సెస్ అయి పాన్ ఇండియా రేంజ్ లో ఎన్టీయార్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుందాం…