RRR Movie:  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి నోట మాట రాని డిస్ట్రిబ్యూటర్స్?

RRR Movie: తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి సినిమా విడుదల అవుతుందంటే ఓ పండుగ వచ్చినట్టే. ఇప్పుడు తెలుగు నాటే కాదు.. దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా మొదలైంది. ఈ సినిమా చూసేందుకు బుకింగ్స్ పోటెత్తుతున్నాయి. తొలి మూడు రోజులు థియేటర్లు నిండిపోవడం ఖాయం. ఇక స్పెషల్ షోల పేరిట ఒక్కో టికెట్ ను రూ.5వేలు పెట్టి చూసేస్తున్నారు. ఇప్పటికే ఫుల్ హైప్ వచ్చిన ఈ సినిమాను చూసేందుకు విదేశాల్లోని భారతీయులు అక్కడి థియేటర్లకు క్యూ […]

Written By: NARESH, Updated On : March 24, 2022 4:48 pm
Follow us on

RRR Movie: తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి సినిమా విడుదల అవుతుందంటే ఓ పండుగ వచ్చినట్టే. ఇప్పుడు తెలుగు నాటే కాదు.. దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా మొదలైంది. ఈ సినిమా చూసేందుకు బుకింగ్స్ పోటెత్తుతున్నాయి. తొలి మూడు రోజులు థియేటర్లు నిండిపోవడం ఖాయం. ఇక స్పెషల్ షోల పేరిట ఒక్కో టికెట్ ను రూ.5వేలు పెట్టి చూసేస్తున్నారు. ఇప్పటికే ఫుల్ హైప్ వచ్చిన ఈ సినిమాను చూసేందుకు విదేశాల్లోని భారతీయులు అక్కడి థియేటర్లకు క్యూ కడుతున్నారు.అయితే బాహుబలి తీసిన రాజమౌళి తన రికార్డును తానే ‘ఆర్ఆర్ఆర్’తో బద్దలు కొడితే ఓకే. తేడా కొడితే మాత్రం ఏంటి అన్న పరిస్థితి తాజాగా నెలకొంది.

RRR

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పంపిణీదారులకు రాజమౌళి, దానయ్య టీం చూపించారట.. ఈ మేరకు మరింత అడ్వాన్సులు తీసుకున్నారట.. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను చూశారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంంలోనే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత దిల్ రాజ్ ను ఫోన్ చేసి అడుగుతున్నారట.. కోట్లు పెట్టి కొన్న ఈ సినిమా విడుదల వేళ డిస్ట్రిబ్యూటర్లలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. వడ్డీలకు తెచ్చి చెల్లించిన సొమ్ము తిరిగి వస్తుందా? అన్న భయాలు వెంటాడుతున్నాయి. వీరి భయాలకు కారణం ఏంటంటే.. సినిమా చూసిన దిల్ రాజు ఇప్పటివరకూ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించలేకపోవడమేనట… అదే పంపిణీదారులను కలవరపెడుతున్న అంశంగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి..

Also Read: RGV Interesting Comments On The Kashmir Files: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ గొప్పతనం గురించి చెప్పిన ఆర్జీవీ

ఇప్పటికే ‘రాధేశ్యామ్’ ను కొని ప్యాన్ ఇండియా మూవీగా భ్రమించి డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగారు. ఇక టికెట్ల రేట్ల తగ్గింపుతో భీమ్లానాయక్ సినిమాతోనూ పెద్దగా లాభాలు రాలేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పైనే వారి ఆశలన్నీ ఉన్నాయి. ఎందుకంటే రాజమౌళి స్టామినాను నమ్మి కోట్లు తీసుకొచ్చి ఈ సినిమాపై పెట్టారు. వడ్డీలు కడుతున్నారు. సినిమా హిట్ అయితే ఓకే.. ఇప్పుడు తేడా కొట్టిందో అందరూ నిండా మునగడం ఖాయం. ఎందుకంటే 400 కోట్లకు పైగా పెట్టి సినిమాను తీశారు. తొలి వారంలోనే ఈ మొత్తం రావాలి. కానీ పంపిణీదారులకు లాభాలు రాకపోతే సినిమాకు ఇన్నాళ్లు పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.అందుకే ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వేళ అందరికంటే టెన్షన్ పడుతున్నారట పంపిణీదారులు. అగ్ర నిర్మాత దిల్ రాజు చూసి స్పందించకపోవడంతో వారి భయాలు మరింత రెట్టింపు అయ్యాయని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది. మరి ఇది నిజమా? కాదా? ‘ఆర్ఆర్ఆర్’ ఫలితం ఎలా ఉంటుందన్నది మరికొద్ది గంటల్లోనే తేలనుంది..

Also Read: RRR Viral: ఆర్ఆర్ఆర్ థియేటర్ తెరల ముందు మేకులు, ఇనుప కంచెలు

Recommended Video: