Extramarital Affair: వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమలోని మాధుర్యాన్ని అనుభవించారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. కాపురం సజావుగా సాగుతున్న తరుణంలో మూడో వ్యక్తి ప్రవేశంతో వారి కల చెదిరిపోయింది. ఇంత కాలం మంచిగా ఉన్నా వారి ప్రేమలో నిజాయితీ కనుమరుగైంది. భార్య అడ్డదారులు తొక్కింది. పరాయి మగాడికి మరిగింది. సుఖం కోసం అర్రులు చాచింది. ఫలితంగా కటకటాలపాలైంది. ఎంతటి వారైనా తప్పు చేస్తే అంతే సంగతి అని తెలిసిందే కాదా. అందుకే ఆమె కట్రతో సంసారానికి దూరమైంది.

నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి పరిధిలోని రాజీవ్ నగర్ కు చెంది. పాలగోని భాస్కర్ గౌడ్, హరిత ప్రేమించుకున్నారు. వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఏడాది క్రితం నగరానికి చేరుకున్నారు. భాస్కర్ ఇషుక వ్యాపారం చేస్తుంటాడు. మధురానగర్ లో వెంకటేష్ ఇంట్లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. దీంతో హరితకు వెంకటేష్ కు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో వీరి విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో భాస్కర్ ఇల్లు ఖాళీ చేసి చింతలకుంటకు వెళ్లారు.
Also Read: Jobs: ఎట్టకేలకు నిరుద్యోగుల ‘ఆకలి’ తీర్చనున్న కేసీఆర్
అక్కడ కూడా వీరి సంబంధం కొనసాగింది. భాస్కర్ ఇంట్లో లేని సమయంలో వెంకటేష్ వస్తూ పోతూ ఉండేవాడు. భాస్కర్ కదలికలు తెలుసుకునేందుకు అతడి కారుకు జీపీఎస్ పరికరాన్ని బిగించాడు. దీంతో అతడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్లేది తెలుస్తోంది. దీని ఆధారంగా వెంకటేష్ తరచూ హరితను కలుస్తుండేవాడు. కొన్నాళ్లు ఇలా సాగినా భాస్కర్ ను అడ్డుతొలగించుకోవాలని వెంకటేష్, హరిత నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను ఓ సుపారీ గ్యాంగ్ కు రూ.5 లక్షలు ముట్టజెప్పారు. దీంతో ఆ గ్యాంగ్ అదును కోసం ఎదురుచూస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 16న హరిత భర్తకు మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. అంతేకాదు అతడి సెల్ కు మెసేజ్ పెట్టింది. తాను ప్రియుడితో కలిసి వెళుతున్నానని చెప్పింది. దీంతో వారి కోసం ఆరా తీసి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో భాస్కర్ హత్యకు పథకం పన్నిన విషయం బయటకు వచ్చింది. దీంతో ఇందుకు సంబంధించిన నిందితుడు నవీన్ ను పట్టుకున్నారు. ఇంకొకరి కోసం గాలిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా పరాయి పురుషుడి మోజులో పడటంతో కష్టాలు మొదలయ్యాయి.
Also Read: Electricity Charges Hike: తెలంగాణ ప్రజలకు ‘షాక్’ ఇవ్వబోతున్న కేసీఆర్..
Recommended Video:
