Dhurandhar OTT: గత ఏడాది డిసెంబర్ నెలలో భారీ అంచనాల నడుమ విడుదలైన రణవీర్ సింగ్(Ranveer Singh) ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రకంపనలు అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. సినిమా విడుదలై రెండు నెలలు కావొస్తుంది , కానీ థియేటర్స్ లో ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతుంది. కొత్త సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ ధురంధర్ చిత్రం మాత్రం ఇప్పటికీ బుక్ మై షో యాప్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా పాతిక వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అట. నిన్న గాక మొన్న విడుదలైన ప్రభాస్ రాజా సాబ్ బుక్ మై షో లో ట్రెండింగ్ నుండి వైదొలగింది. దీనిని బట్టీ ఈ సినిమా లాంగ్ రన్ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి.
అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విడుదల తర్వాత అన్ని ప్రాంతీయ భాషలకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ 280 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ నెల 30 న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతుందంటూ నేడు నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. దీంతో మూవీ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. థియేట్రికల్ వెర్షన్ తెలుగులో రిలీజ్ అవుతుందని ఆశించారు. కానీ కుదర్లేదు, ఇప్పుడు తెలుగు వెర్షన్ లో ఈ చిత్రం ఈ నెల 30 నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. ఇక మన ఆడియన్స్ ఈ సినిమాని ఏ లెవెల్ లో చూస్తారో ఊహించుకోవచ్చు.
అయితే మొదటి భాగం పట్ల చేసిన పొరపాటు ని రెండవ భాగానికి చేయదల్చుకోలేదు ‘ధురంధర్ 2’ మేకర్స్. ఈ సినిమా ని మార్చి 19 న హిందీ , తెలుగు తో పాటు, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఎల్లుండి ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేస్తారట. ఈ టీజర్ కోసం కేవలం బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, మన టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు వెర్షన్ చూసిన తర్వాత ‘ధురంధర్ 2’ కి తెలుగు రాష్ట్రాల్లో బంపర్ ఓపెనింగ్స్ ఇచ్చేందుకు మన ఆడియన్స్ రెడీ గా ఉన్నారు.