Rinku Singh: బంతిని బలంగా కొడతాడు.. బంతి దిశ ఎలా ఉన్నా సరే.. తన దిశలోకి పంపిస్తుంటాడు. బౌలర్ ఎవరనేది చూడడు. మైదానం ఎలా ఉన్నా సరే పట్టించుకోడు. చివర్లో వస్తాడు మెరుపులు మెరిపించి వెళ్ళిపోతుంటాడు. టైం ను కాకుండా టైమింగ్ ను నమ్ముతుంటాడు. అందువల్లే అతడిని భయంకరమైన ఆటగాడు అని పిలుస్తుంటారు.
పరుగులు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ.. బలంగా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్నప్పటికీ.. అతడికి అవకాశాలు వస్తున్నది అంతంత మాత్రమే. చివర్లో బ్యాటింగ్ చేసే అవకాశం రావడంతో.. తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం ఉండేది కాదు. దీంతో అతడు కొన్ని సందర్భాలలో జట్టుకు దూరంగా ఉండి పోవాల్సి వచ్చింది. అయితే డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించిన నేపథ్యంలో ఎట్టకేలకు మేనేజ్మెంట్ అతనికి అవకాశం ఇచ్చింది. మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వడమే ఆలస్యం విమర్శకులు తమ నోటికి పని చెప్పారు. అసలు అటువంటి ఆటగాడిని ఎందుకు ఎంపిక చేశారని విమర్శలు మొదలుపెట్టారు.. దీంతో అతడు తనను తాను నిరూపించుకోవాలని బలంగా కోరుకున్నాడు. టి20 వరల్డ్ కప్ ముంగిట వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో బుధవారం నాగ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో దుమ్మురేపాడు.. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు? అంటే..
పేద కుటుంబం నుంచి క్రికెట్ అంటే ఇష్టంతో.. క్రికెట్ లోకి ప్రవేశించాడు రింకు సింగ్. కోల్ కతా జట్టు తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడిన అనుభవం అతడి సొంతం. అందువల్లే అతడు టి20 అవకాశాలను పొందగలిగాడు. అయితే చివర్లో బ్యాటింగ్ చేసే అవకాశం రావడంతో తన సామర్థ్యాన్ని నిరూపించుకునే సందర్భం అతడికి తక్కువసార్లు లభించింది. ఏది ఏమైనప్పటికీ న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్ లో అతడికి అవకాశం లభించింది. తద్వారా వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ఏకంగా 44 పరుగులు చేసి అదరగొట్టాడు. 20 బదులు ఎదుర్కొన్న అతడు నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 44 పరుగులు చేశాడు. ఒకవేళ అతడికి అర్ష్ దీప్ సింగ్ నుంచి సహకారం లభించి ఉంటే కచ్చితంగా హాఫ్ సెంచరీ చేసేవాడు. రిగు సింగ్ 44 పరుగులు చేయడం ద్వారా సరికొత్త రికార్డులను సృష్టించాడు.
రింకు సింగ్ కు బ్యాటింగ్ చేయడానికి ఎక్కువగా 19, 20 ఓవర్లలోనే అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలను రింగు సింగ్ సద్వినియోగం చేసుకున్నాడు. టి20 రింకు సింగ్ 19 నుంచి 20 ఓవర్ల మధ్యలో దాదాపు 74 బంతులు ఎదుర్కొన్నాడు. ఇందులో అతడు 213 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 287.83 ఉండడం విశేషం. అతడి ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 22 సిక్సర్లు ఉన్నాయి. బౌండరీ శాతం 48.6 గా ఉంది. కాగా, నాగ్ పూర్ మైదానంలో 200+ స్కోర్ నమోదు కావడం ఇది రెండవసారి. 2009లో శ్రీలంక జట్టు భారత జట్టు పై ఐదు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఈ మైదానంలో టి20 లో ఇదే హైయెస్ట్ స్కోర్ గా కొనసాగుతోంది.
Rinku Singh Play only 32 balls in whole 2025 in T20Is for India.
– Rinku Who carry Team India batting lineup after collapsed was benched for whole 2025.
– It’s shame for Management who Benched a player like Rinku Singh. pic.twitter.com/rdfdHQSRKt
— Sam (@Cricsam01) January 21, 2026