https://oktelugu.com/

దిగ్గజ జర్నలిస్టు వైరాగ్యం.. జర్నలిజంకు గుడ్ బై?

ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, మహాటీవీ, టీవీ5 ఇలా ఎన్నో ప్రముఖ చానెల్స్ లో జర్నలిస్టుగా పనిచేసి ప్రముఖులను కూర్చుండబెట్టి డిబేట్ లు నిర్వహించే ప్రముఖ దిగ్గజ జర్నలిస్టు మూర్తి వైరాగ్యంతో జర్నలిజంనే వదిలిపెట్టాలని భావిస్తున్నట్టు మీడియా సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీవీ5లో కీలక జర్నలిస్టుగా మూర్తి కొనసాగుతున్నారు. ఆ చానెల్ ను వదిలేయాలని.. పూర్తిగా జర్నలిజంకే గుడ్ బై చెప్పాలని యోచిస్తున్నట్టు మీడియా సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. అయితే దీనికి బలమైన […]

Written By:
  • NARESH
  • , Updated On : June 23, 2021 8:21 pm
    Follow us on

    ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, మహాటీవీ, టీవీ5 ఇలా ఎన్నో ప్రముఖ చానెల్స్ లో జర్నలిస్టుగా పనిచేసి ప్రముఖులను కూర్చుండబెట్టి డిబేట్ లు నిర్వహించే ప్రముఖ దిగ్గజ జర్నలిస్టు మూర్తి వైరాగ్యంతో జర్నలిజంనే వదిలిపెట్టాలని భావిస్తున్నట్టు మీడియా సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీవీ5లో కీలక జర్నలిస్టుగా మూర్తి కొనసాగుతున్నారు. ఆ చానెల్ ను వదిలేయాలని.. పూర్తిగా జర్నలిజంకే గుడ్ బై చెప్పాలని యోచిస్తున్నట్టు మీడియా సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.

    అయితే దీనికి బలమైన కారణం ఏదీ లేదని.. వ్యక్తిగత కారణాల వల్లనే జర్నలిజం వృత్తిని మూర్తి విడిచిపెట్టాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. మూర్తి తన సొంత గ్రామం వెళ్లి వ్యవసాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

    ప్రస్తుతానికి మూర్తి వ్యక్తిగత సమస్యల కారణంగా జర్నలిజం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడని.. అతడు వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ తర్వాత మళ్లీ మీడియాలోకి వచ్చే అవకాశాలు తోసిపుచ్చలేమని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

    అయితే మూర్తి జర్నలిజంను వదిలిపెట్టాడన్న వార్తలో ఎంత నిజం ఉందో ఖచ్చితంగా తెలియదు. అదే నిజమైతే ఇది ఆయన జీవితంలోనే అత్యంత కఠిన నిర్ణయం అవుతుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడోనన్నది ఆసక్తికరంగా మారుతుంది.

    అయితే మూర్తి జర్నలిజంలో విసిగిపోయాడని.. ఫలానా పార్టీ అని.. కొమ్ము కాస్తున్నాడని.. కేసులు, వేధింపులతో వదిలేసి వ్యవసాయం బాట పడుతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.