https://oktelugu.com/

ఆ టాప్ న్యూస్ చానెల్ కొంప ముంచుతున్న వివాదాలు..‘వాస్తు’ ఎఫెక్టేనా?

  తెలుగులోనే టాప్ న్యూస్ చానెల్ ను వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల పక్కనున్న స్థలంలో కార్పొరేట్ తరహాలో బిల్డింగ్ కట్టేశారు. అందులో కొత్త ఆఫీసు నడిపిస్తున్నారు. అయితే ఏమైందో కానీ తరుచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయట.. తాజాగా చానెల్ వ్యవహారం పోలీస్ మెట్లు ఎక్కింది. అందులో పనిచేసే ఓ యాంకర్ తన ఫోన్ డేటాను చోరీ చేశారని అందులోని ఇద్దరు యాంకర్లతోపాటు సహకరించిన ప్రధాన యాంకర్, హెచ్ఆర్ పై కేసు పెట్టడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : July 27, 2021 / 08:39 AM IST
    Follow us on

     

    తెలుగులోనే టాప్ న్యూస్ చానెల్ ను వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల పక్కనున్న స్థలంలో కార్పొరేట్ తరహాలో బిల్డింగ్ కట్టేశారు. అందులో కొత్త ఆఫీసు నడిపిస్తున్నారు. అయితే ఏమైందో కానీ తరుచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయట..

    తాజాగా చానెల్ వ్యవహారం పోలీస్ మెట్లు ఎక్కింది. అందులో పనిచేసే ఓ యాంకర్ తన ఫోన్ డేటాను చోరీ చేశారని అందులోని ఇద్దరు యాంకర్లతోపాటు సహకరించిన ప్రధాన యాంకర్, హెచ్ఆర్ పై కేసు పెట్టడం కలకలం రేపుతోంది.

    ఈ వ్యవహారంతో తలబొప్పి కట్టిన సదురు న్యూస్ చానెల్ యాజమాన్యం వెంటనే ఆ ముగ్గురు ప్రధాన లేడీ యాంకర్లను తొలగించడం సంచలనమైంది. ఇది ఆ చానెల్ పై తీవ్ర ప్రభావమే చూపుతోందట..

    ఇప్పటికీ పాత సీఈవో వ్యవహారంలో అభాసుపాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ చానెల్ కు ప్రధాన ఇబ్బందులు ఇటీవలే పక్కనున్న స్థలంలో కట్టిన కొత్త భవనం అని.. అది వాస్తు లేకుండా కట్టారని.. అందుకే ఈ సమస్యలు వస్తున్నాయని అందులోని ఉద్యోగులు వాపోతున్నారట..

    మొత్తానికి వాస్తుమార్పునో.. ఆధిపత్యపోరో.. లేక పక్కన స్థల ప్రభావమో కానీ ఇప్పుడా చానెల్ వ్యవహారాలు రచ్చకెక్కుతూ ఆగమాగం చేస్తున్నాయట.. పాపం..