Biker Movie 4th Day Collections: వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న టాలీవుడ్ కి , ఈ సమ్మర్ ఆరంభం లో విడుదలైన శర్వానంద్(Actor Sharwanand) ‘బైకర్'(Biker Movie) చిత్రం బయ్యర్స్ కి కొత్త ఆశలు చిగురించేలా చేశాయి. ఎందుకంటే చాలా కాలం తర్వాత పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రమిది. అలా ఎలాంటి అంచనాలు లేకుండా , చాలా సింపుల్ గా విడుదలైన ఈ మూవీ కి డీసెంట్ ఓపెనింగ్ వీకెండ్ లభించింది. అయితే వీకెండ్ లో వచ్చిన ఈ వసూళ్లు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఏ మాత్రం సరిపోదు, లాంగ్ రన్ లో ఈ సినిమా నిలుస్తుందా లేదా అనే అనుమానం ట్రేడ్ వర్గాల్లో ఉండేది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేసింది ఈ చిత్రం. సోమవారం రోజున ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో టికెట్ సేల్స్ చాలా డీసెంట్ గా జరిగాయి .
దాదాపుగా 16 వేల టిక్కెట్లు సోమవారం రోజున ఈ చిత్రానికి అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. బీ, సి సెంటర్స్ లో కలెక్షన్స్ బాగా డౌన్ అయ్యాయి కానీ, సిటీస్ మరియు టౌన్స్ మాత్రం వసూళ్లు చాలా స్టడీ గా ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ నుండి పెద్దగా వసూళ్లు నమోదు అవ్వలేదు కానీ , మల్టీప్లెక్స్ ఆడియన్స్ లో మాత్రం బలమైన గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. దీంతో ఈ వారం మొత్తం ఈ చిత్రానికి మంచి రన్ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 4 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి `40 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అవుతాయని, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 50 నుండి 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు.
మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 5 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు అదనంగా 55 లక్షల రూపాయిలు రావడం తో , మొదటి నాలుగు రోజులకు కలిపి 6 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లకు చేరే అవకాశం ఉంది. ఇదే రేంజ్ జోరు ని చూపిస్తే , ఈ చిత్రం ఈ వీకెండ్ కి 10 నుండి 12 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లను అందుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రం 21 కోట్ల రూపాయిల షేర్ మార్కుని కచ్చితంగా అందుకోవాల్సి ఉంటుంది. ఈ వారం లోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ‘డెకాయిట్ ‘, ‘LIK’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వీటిని తట్టుకొని ‘బైకర్’ నిలబడగలదో లేదో చూడాలి.