Bigg Boss 9 Telugu Emmanuel: బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) అంటే మనకు గుర్తుకు వచ్చే రెండు మూడు పేర్లలో ఒకటి ఇమ్మానుయేల్. ఈ సీజన్ కి ఆయన ఒక వెన్నుముక లాంటోడు. ఆడిన ప్రతీ టాస్క్ గెలిచి నూటికి 99 శాతం స్ట్రైక్ రేట్ సంపాదించడమే కాకుండా, ప్రేక్షకుల చేత పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించే కామెడీ ని అందించడం, హౌస్ మేట్స్ అందరితో చక్కగా కలిసిపోవడం, స్నేహితులకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడం, తల్లి బంధానికి విలువ ఇవ్వడం, ఇలా ఒక్కటా రెండా, ఇమ్మానుయేల్ ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్. టైటిల్ విన్నర్ గా నిలిచేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్ అతను. హౌస్ మేట్స్ అందరిలో కూడా టైటిల్ విన్నింగ్ రేస్ ఇమ్మానుయేల్ మరియు తనూజ మధ్య నే ఉంటుంది అనుకున్నారు. ఫ్యామిలీ వీక్ లో వచ్చిన ప్రతీ ఒక్కరు కూడా ఇమ్మానుయేల్ ని టాప్ 2 లేదా టాప్ 1 రేంజ్ లో పెట్టారు.
అలాంటి కంటెస్టెంట్ ఇప్పుడు టాప్ 4 రేంజ్ లో ఎలిమినేట్ అయ్యాడట. ఈరోజు టెలికాస్ట్ అవ్వబోయే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో మీరు ఇది చూడొచ్చు. ఇమ్మానుయేల్ ఎలిమినేట్ అవ్వగానే హౌస్ లో కంటెస్టెంట్స్ ప్రతీ ఒక్కరు షాక్ కి గురయ్యారట. ఇమ్మానుయేల్ కి కూడా కుప్పకూలిపోయినంత పని అయ్యిందట. వెక్కి వెక్కి ఏడ్చాడట. ఎంతో కష్టపడి గేమ్ ఆడాను, నేనేమి తప్పు చేసానని ఆడియన్స్ నన్ను ఈ స్థానాల్లో పెట్టారు అని బాధపడ్డాడట. అతనితో హౌస్ మేట్స్ తనూజ , కళ్యాణ్, డిమోన్ పవన్ లు కూడా బాగా ఏడ్చినట్టు తెలుస్తోంది. ఇక ఫ్యామిలీ వీక్ లో హౌస్ లోకి అడుగుపెట్టిన ఇమ్మానుయేల్ తల్లి, హౌస్ లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చావు, వచ్చేటప్పుడు హీరో గా తిరిగి రావాలి అని చెప్పింది గుర్తుంది కదా, అలా చెప్పిన ఆమె, తన కొడుకు నాల్గవ స్థానం లో ఎలిమినేట్ అవ్వడం చూసి బాగా ఏడ్చేసిందట.
ఇమ్మానుయేల్ పడిన కష్టానికి కనీసం సూట్ కేసు ని అయినా బిగ్ బాస్ టీం ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఒక్క పైసా కూడా ఆయనకు ఆఫర్ చేయలేదట. ఇలా చేయడం బిగ్ బాస్ టీం కి న్యాయమా ? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఈ షో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి రెండు మూడు కారణాల్లో ఒకటి ఇమ్మానుయేల్ పెర్ఫార్మన్స్. అలాంటి వ్యక్తిని గౌరవించుకోవడం, గుర్తించుకోవడం బిగ్ బాస్ టీం బాధ్యత, కానీ అది చేయలేదు. టీఆర్ఫీ రేటింగ్స్ కోసం పాపం ఇమ్మానుయేల్ ని బాగా ఉపయోగించుకొని ఖాళీ చేతులతో బయటకు పంపేశారు. బిగ్ బాస్ సీజన్ 8 లో అవినాష్ ఒక మాట అంటాడు. కమెడియన్స్ ని ఆడియన్స్ కేవలం కమెడియన్ గా మాత్రమే చూస్తారు, విన్నర్ గా చూడరు, రన్నర్ రేంజ్ కి రావడం కూడా కష్టమే అని. కానీ ఇమ్మానుయేల్ కి విన్నర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అనుకున్నారు. కానీ చివరికి అవినాష్ చెప్పినట్టే టాప్ 4 స్థానం లో ఎలిమినేట్ అయిపోయాడు.