Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 అన్ని సీజన్లు కంటే భిన్నంగా సాగుతుంది. ఉల్టా పుల్టా అంటూ సీజన్ ప్రారంభించారు. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ట్విస్టులు, సర్ప్రైజ్ లతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. గత సీజన్ తో పోల్చుకుంటే .. దీనికి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ఫలితంగా బిగ్ బాస్ టీమ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కాగా బిగ్ బాస్ 7 లో ఎన్నడూ లేని విధంగా కొత్త టాస్కులు.. నామినేషన్ ప్రక్రియ కూడా సరికొత్తగా నిర్వహిస్తున్నారు. దీంతో భారీ రేటింగ్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన సీజన్. ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకుని .. పదకొండో వారంలో అడుగుపెట్టింది. ఐదవ వారంలో ఐదుగురుని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపించారు. ఇక పది వారాలు ..పది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. రతిక రీ ఎంట్రీ తో హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కాగా ఫ్యామిలీ వీక్ కూడా ముందే నిర్వహించి ఆడియన్స్ ని మరింత ఆకట్టుకున్నారు బిగ్ బాస్ టీమ్.
అయితే సీజన్ 7 ని పదిహేను వారాల పాటు నిర్వహించబోతున్నట్లు టీం ముందుగానే ప్రకటించింది. దీని ప్రకారం ఇంకో ఐదు వారాల్లో ఈ సీజన్ ముగింపు పలుకుతారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు హౌస్ లో పది మంది సభ్యులు ఉండడంతో ఈ సారి టాప్ 6 ను ఫైనల్ కు పంపుతారా .. లేక సీజన్ పొడిగిస్తారా అన్న సందేహాలు వస్తున్నాయి.
కాగా ఉల్టా పుల్టా సీజన్ కావడంతో దీన్ని మరింత పొడిగించబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ సీజన్ ను మరో ఒకటి రెండు వారాలకు పెంచబోతున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇక నాగార్జున కూడా ఓకే అంటే ఈ నిర్ణయం తీసుకుంటారని టాక్ నడుస్తుంది. కాగా 10వ వారం భోలే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. నేటి ఎపిసోడ్లో 11వ వారం నామినేషన్స్ లో ఎవరు ఉన్నారో తెలుస్తుంది.