Best 7 Seater Cars: ప్రస్తుత కాలంలో కార్లు కొనే వారి అభిరుచులు మారిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం చిన్న కారు ఉంటే సరిపోతుంది అని అనుకునేవారు.. ఇప్పుడు విశాలమైన కార్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం గలవారు అయితే 7 సీటర్ కారు తప్పనిసరి అని అనుకుంటున్నారు. మరికొందరు కార్యాలయ అవసరాలతో పాటు ట్రావెల్ చేయడానికి కూడా ఇటువంటి కారు ఉండాలని అనుకుంటున్నారు. అయితే సెవెన్ సీటర్ అనగానే ఎక్కువ ధర అని అనుకుంటారు. కానీ ఈ రూ.10 లక్షల లోపు బెస్ట్ సెవెన్ సీటర్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవేవో ఇప్పుడు చూద్దాం..
భారతదేశంలో ఎంతోమంది కార్ల వినియోగదారులను ఆకట్టుకుంది Mahindra కంపెనీ. ఈ కంపెనీ నుంచి సెవెన్ సీటర్ వేరియంట్ లో Bolero వెహికల్ ది బెస్ట్ అని అంటున్నారు. ఎందుకంటే ఇది గ్రామీణ రోడ్లపై కూడా స్మూత్ గా డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు. బొలెరోలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉండనుంది. ఇది 75 బిహెచ్పి పవర్ తో పాటు 210 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పనిచేసే ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది ప్రస్తుతం మార్కెట్లో రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
Maruti Suzuki కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎన్నో కార్లు వచ్చాయి. కానీ 7 సీటర్ విభాగంలో మాత్రం Ertiga కారు ప్రత్యేకత సాధించుకుంది. ఇందులో ఉండే ఇంటీరియర్, టెక్నాలజీ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఇది 103 బిహెచ్పి పవర్, 136 NM టార్క్ ను లీజ్ చేస్తుంది. పెట్రోల్ తో పాటు CNG వేరియంట్ కూడా ఇందులో ఉంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో పనిచేస్తుంది. ఈ కారులో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ కారును.8.80 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
CITROYEN కంపెనీకి చెందిన స్టైలిష్ 7 సీటర్ హెయిర్ క్రాస్ X. చూడగానే ఆకట్టుకునే ఈ కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఇది 110 bhp పవర్, 205 NM tark ను రిలీజ్ చేస్తుంది. ఈ కారులో ప్రీమియం టచ్ బోర్డుతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లో ఉన్నాయి. సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ABS వంటి టెక్నాలజీని అమర్చారు. దీంతో ఈ కారు నీటి తరం వారికి బాగా ఆకట్టుకుని అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.