Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh: బండ్ల గణేష్ కు అన్ని దారులు మూసుకుపోయాయా.. పాపం పరిస్థితి ఏంటి..

Bandla Ganesh: బండ్ల గణేష్ కు అన్ని దారులు మూసుకుపోయాయా.. పాపం పరిస్థితి ఏంటి..

Bandla Ganesh: పవన్ కళ్యాణ్ కు అపర వీర అభిమాని బండ్ల గణేష్. ఈయన నటుడు మాత్రమే కాదు.. వ్యాపారవేత్త కూడా. పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ పేరుతో ఈయనకు బ్రాయిలర్.. లేయర్ కోళ్ల తయారీ సంస్థ.. ఉంది. ఈయనకు సొంతంగా కోళ్ల ఫారాలు కూడా ఉన్నాయి. ఈయన వ్యాపారం కోట్లలో జరుగుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో కూడా ఈయన వ్యాపారాలు సాగిస్తూ ఉంటారు.

పరమేశ్వర ఆర్ట్ పిక్చర్స్ పేరుతో ఒక చిత్ర నిర్మాణ సంస్థను కూడా ఈయన ప్రారంభించారు.. విజయవంతమైన సినిమాలను రూపొందించారు. గబ్బర్ సింగ్ సినిమా ఈయన నిర్మాణ సంస్థలో రూపొందిందే. బండ్ల గణేష్ తన వ్యాపారన విస్తరణకు పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరు మీద యూనియన్ బ్యాంకులో రుణం తీసుకున్నాడు. అయితే అరుణాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. చివరికి వన్ టైం సెటిల్మెంట్ స్కీం కింద ఆయనకు ఇచ్చిన రుణాన్ని రికవరీ చేసింది.

ఆరుణం చెల్లించిన తర్వాత బండ గణేష్ ధ్రువీకరణ పత్రాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అయితే యూనియన్ బ్యాంక్ బండ్ల గణేష్ కు సంబంధించిన ఒక ఆస్తిని వేలం వేసింది. దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే.. యూనియన్ బ్యాంక్ సర్ఫేసీ చట్టాన్ని బండ్ల గణేష్ మీద ప్రయోగించింది. దీనిపై బండ్ల గణేష్ డి ఆర్ టి ని ఆశ్రయించారు. ఈ తీర్పు బండ్ల గణేష్ కు అనుకూలంగా వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు డిఆర్టి తీర్పును కొట్టివేసింది.

ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు సుప్రీంకోర్టులోనే న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న రుణాన్ని చెల్లించినప్పటికీ యూనియన్ బ్యాంక్ తనమీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందని బండ్ల గణేష్ బాధపడుతున్నారు. అందువల్లే ఆయన సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. మరి సుప్రీంకోర్టు అయినా బండ్ల గణేష్ కు న్యాయం చేస్తుందా.. ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుందా.. చూడాల్సి ఉంది.

యూనియన్ బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు.. బండ్ల గణేష్ సకాలంలో చెల్లించలేదని బ్యాంకు వర్గాలు అంటున్నాయి. మొండి బకాయిగా మారుతున్న క్రమంలోనే వన్ టైం సెటిల్మెంట్ స్కీం ఆయనకు అందుబాటులోకి తీసుకొచ్చామని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. వన్ టైం సెటిల్మెంట్ స్కీం కింద బండ్ల గణేష్ లోన్ చెల్లించినప్పటికీ.. ఇంకా పాత బకాయిలు ఏమైనా ఉన్నాయా.. అందువల్లే బ్యాంకు వర్గాలు ఆయన ఆస్తిని వేలం వేశాయా.. అనే చర్చలు నడుస్తున్నాయి. మరి దీనిపై యూనియన్ బ్యాంకు ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version