Balayya – Mokshajna : గుర్రాన్ని చెరువు దగ్గరకు తేగలం కానీ దానితో నీళ్లు తాగించలేం అనేది సామెత. బాలయ్య-మోక్షజ్ఞలకు ఇది సరిగ్గా సరిపోతుందన్న వాదన వినిపిస్తోంది. నాకు హీరో కావడం ఇష్టం లేదు మహా ప్రభో అంటున్నా మోక్షజ్ఞను బాలయ్య వదలడం లేదు. మన కుటుంబం కొన్ని తరాల పాటు జనాల్లో ఉండిపోవాలంటే హీరోగా మారాల్సిందే అంటున్నారు. అది కూడా నిజమే. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ పెద్ద స్టార్ అయ్యాడు కాబట్టి… ఆయన నట వారసత్వాన్ని ఢోకా లేదు. మరో రెండు జనరేషన్స్ వరకు రామ్ చరణ్ మెగా లెగసి ముందుకు తీసుకెళ్తాడు.
మోహన్ బాబు విషయం తీసుకుంటే ఆయన ఇద్దరు కుమారులు సక్సెస్ కాలేదు. మంచు ఫ్యామిలీకి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ మాత్రం గౌరవం ఉందో తెలిసిందే. అదే విష్ణు, మనోజ్ లలో కనీసం ఒక్కరు స్టార్ అయినా వాళ్ళ పరిస్థితి వేరుగా ఉండేది. నెక్స్ట్ విష్ణు, మనోజ్ వారసులు ఫస్ట్ నుండి మొదలుపెట్టాలి. ఒక స్టార్ హీరో కొడుక్కి దక్కే గ్రాండ్ లాంచింగ్, హైప్ వాళ్లకు ఉండదు.
బాలయ్య భయపడుతుంది దీనికే. మెగా హీరోల మాదిరి నందమూరి హీరోలు సక్సెస్ కాలేదు. ఎన్టీఆర్ కి 8 మంది కుమారులు కాగా నటులు అయ్యింది ఇద్దరే. స్టార్ అయ్యింది బాలయ్య ఒక్కరే. మూడవ తరంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సక్సెస్ అయ్యారు. కళ్యాణ్ రామ్ కిందా మీదా పడుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని బాలయ్య ఒప్పుకోడు. ఎదుగుదలను ఓర్వలేడు. కుటుంబ సభ్యుడైనా కానీ ఎప్పుడు పడిపోతాడా అని ఎదురు చూస్తుంటాడని కొందరి వాదన.
కాబట్టి నందమూరి వంశ నట వారసత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తన రక్తం పంచుకు పుట్టిన మోక్షజ్ఞదే అని ఆయన విశ్వాసం. కానీ ఏం లాభం… అసలు కాండేట్ కి ఇంట్రెస్ట్ లేదు. ముప్పై ఏళ్ళు దగ్గరపడినా చలనం లేదు. హీరో అవడం నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా బాలయ్య వినడం లేదు. కాదు నువ్వు హీరో అవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాడు. జనాలు మర్చిపోకుండా అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అంటూ హింట్స్ ఇస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం ఏమిటంటే… ఇకపై నేను హీరో అయ్యేది లేదని మోక్షజ్ఞ తేల్చి చెప్పేశాడట. బాలయ్య బ్రతిమిలాడినా భయపెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందట. మోక్షజ్ఞ హీరో అవుతాడని ఆశపడుతున్న ఫ్యాన్స్ ఆ కలలు నుండి బయటికి వస్తే బెటర్ అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.