Balakrishna Son Film Entry Delay: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఒకప్పుడు మన ఇండస్ట్రీ ని ఎవ్వరు పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ లో ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరికొంతమంది యంగ్ హీరోలు సైతం ఇండస్ట్రీకి వచ్చి సందడి చేస్తున్నారు. మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించి ఆ తర్వాత టాలెంటెడ్ హీరోలుగా వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి నటసింహం బాలయ్య బాబు కెరియర్ మొదట్లో మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. నందమూరి తారక రామారావు గారి కొడుకు అంటే ఏంటో యావత్ తెలుగు ఇండస్ట్రీ కి చూపించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ బాలయ్య తన కొడుకు అయిన మోక్షజ్ఞ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. తనని ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో గత ఆరు సంవత్సరాల నుంచి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికి ఇప్పటివరకు అతని సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఒక్కో సంవత్సరం ఒక్కో డైరెక్టర్ తో ఆయన సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చినప్పటికి, అవి ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే వస్తున్నాయి తప్ప కార్య రూపం దాల్చడం లేదు.
Also Read: వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త మూవీ లో సెకండ్ హీరో గా కళ్యాణ్ రామ్..వీడియో వైరల్!
దాంతో విసిగిపోయిన నందమూరి అభిమానులు సైతం ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఉండదని ఫిక్స్ అయ్యారు. ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు సైతం ఇక మోక్షజ్ఞ ని పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదట. మోక్షజ్ఞ కి సినిమాలు చేసే ఉద్దేశ్యం లేనట్టుగా తెలుస్తుంది.
అందువల్లే అతను మూవీస్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి తన కొడుకును ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు… నాగార్జున తన ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్లిద్దరితో పోలిస్తే బాలయ్య బాబు తన కొడుకు విషయంలో ఫెయిల్ అయిపోయాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఇక మోక్షజ్ఞ ఎందుకని ఇలా చేస్తున్నాడు. సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని ముందే చెప్పొచ్చు కదా! వాళ్ళ అభిమానులను ఆశ పెట్టి మరి ఇలా మోసం చేయడం ఎందుకు అంటూ మరికొంతమంది సినిమా ప్రేక్షకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…