Balakrishna Koratala Siva Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలను చూడటానికి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం బాలయ్య బాబు వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులు అలరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్న బాలయ్య బాబు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలావరకు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేస్తున్న బాలయ్య ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈరోజే ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
150 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమా ఒక హై వోల్టేజ్ కథ తో రాబోతుందట. అయితే బాలయ్య బాబు మీద 150 కోట్లు పెట్టడం అనేది ఒక వంతుకు రిస్క్ అని చాలామంది చెబుతున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే బాలయ్య భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టిన కూడా ఆయన సినిమాలు 100 కోట్లకు మించి కలెక్షన్స్ ను రాబట్ట లేకపోతున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద 150 కోట్ల బడ్జెట్ పెట్టడం అనేది ప్రొడ్యూసర్ కొంతవరకు రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. ఇక మరికొంతమంది మాత్రం కథ అద్భుతంగా ఉందని దానివల్లే ఓవర్ బడ్జెట్ అయిన కూడా దానిని బాలయ్య బాబు రికవరీ చేయగలిగే కెపాసిటి ఉందని మరి కొంతమంది భావిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ బాలయ్య బాబుతో సాహసం చేస్తున్నాడనే చెప్పాలి.
ఇంతకుముందు తను చేసిన దేవర సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న కూడా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టలేక పోయింది. ఇక ఆ క్రమంలోనే బాలయ్య బాబుతో ఏ ధైర్యంతో 150 కోట్లు పెట్టి సినిమాను చేయిస్తున్నాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
