Balakrishna dream role: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తుంటాయి. అలాగే వాళ్ల సినిమాల వల్ల వాళ్లకి ఎక్కువగా రీచ్ వస్తుంది. దానివల్ల స్టార్ డైరెక్టర్లు సైతం స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య బాబు లాంటి నటుడు సైతం డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. కెరియర్ మొదట్లో మాస్ సినిమాలను చేశాడు. కానీ ఇప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేయాలని చూస్తున్నాడు. కానీ వాటికి ఎక్కువ బడ్జెట్ అవుతుండటంతో కమర్షియల్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నాడు. ఇక తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటి వరకు ఆయన ఒక పాత్రలో నటించాలని చేస్తున్నాడట. కానీ అది వర్కౌట్ కావడం లేదు…ఇంతకీ ఆ పాత్ర ఏంటి అంటే ఆయనకి ఒక ప్రత్యేకమైన విలన్ పాత్రలో నటించాలని ఉందట. ఇప్పటివరకు ఆయనకు అలాంటి పాత్ర దొరకలేదట.
ఎవరైనా ఒక డైరెక్టర్ ఒక డిఫరెంట్ ను పాత్రను డిజైన్ చేసుకొని తనని కలిస్తే మాత్రం అందులో నటించడానికి తను సిద్ధంగా ఉన్నానని ఆయన తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నాడు. మొత్తానికైతే 100కు పైన చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన ఇప్పుడు విలన్ పాత్రలో మెప్పించాలని చూస్తున్నాడు.
Also Read: త్రిబుల్ ఆర్ టైమ్ లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ మధ్య గొడవలు రావడానికి కారణం ఇదే…
ఎందుకంటే హీరోలకు నటించడానికి పెద్దగా వేరియేషన్స్ అయితే ఏమీ ఉండవు. కానీ విలన్ పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి వాటిలో నటిస్తే తమ నటన ప్రతిభను బయటకు తీయొచ్చు అనే ఉద్దేశ్యంతో బాలయ్య బాబు ఉన్నారట. తను ఆ పాత్ర లో చేస్తే తన అభిమానులు సైతం ఒప్పుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఇంకొంతమంది దర్శకులతో కలిసి డిఫరెంట్ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది… మొత్తానికైతే తన డ్రీమ్ రోల్ లో నటింప చేయగలిగే దర్శకుడు ఎవరు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
