Attitude Star Chandrahas: ప్రముఖ టీవీ సీరియల్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్ర హాస్ తన మొదటి సినిమా లాంచింగ్ సమయం లో యాటిట్యూడ్ తో ప్రవర్తించిన తీరు అప్పట్లో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా చేయనందుకు చంద్ర హాస్ పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అంతే కాకుండా ఆ సందర్భాన్ని పెద్ద మీమ్ గా వాడుకున్నారు మీమర్స్. ఇప్పటికీ ఆ మీమ్ పలు సందర్భాల్లో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది. అప్పటి నుండి ఇతను యాటిట్యూడ్ స్టార్ అని తనకు తానూ పేరు పెట్టుకొని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఇదే యాటిట్యూడ్ తో ఉంటే బాగా వైరల్ అవుతున్నాం అనుకున్నాడో ఏమో తెలియదు, ఈ కుర్రాడు రీసెంట్ గా తన కొత్త సినిమా సాంగ్ ఈవెంట్ లో పాడిన ఒక అసభ్యకరమైన పాట ఇప్పుడు సంచలనం గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే చంద్రహాస్ లేటెస్ట్ గా ‘బారాబర్ ప్రేమిస్తా’ అనే చిత్రం లో హీరోగా నటించాడు. ఈ సినిమాలోని మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి సంబంధించిన ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో తన సొంతంగా ఒక అసభ్యకరమైన పాట రాసుకొచ్చి, స్టేజి మీద మైక్ అందుకొని ఇష్టమొచ్చినట్టు పడేసాడు చంద్ర హాస్. ఆ ఈవెంట్ కి ఆడవాళ్లు వచ్చారు, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్ర హాస్ ప్రవర్తించిన ఈ తీరుపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇలా చేస్తే ఆడియన్స్ చూస్తూ ఊరుకోరు అనే విషయం తెలిసి కూడా, ఇలా చేస్తున్నాడంటే, ఆడియన్స్ పట్ల ఇతనికి ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందని అంటున్నారు నెటిజెన్స్. పైగా ఆయన ఆ ఈవెంట్ లో మాట్లాడిన కొన్ని మాటలు చూస్తే ఎలాంటివాడికైనా కోపం రాక తప్పదు.
ఈ ట్యూన్ సినిమాలో ఉంటుంది కానీ, లిరిక్స్ మాత్రం ఇవి ఉండవని, ఇది కేవలం నా సొంత రైటింగ్ తో రాసుకొచ్చానని, సినిమాలో సెన్సార్ బోర్డు వాళ్ళు ఒప్పుకోరని అంటున్నాడు. పైగా తన పాటని ఇక్కడ ఉన్నోళ్లంతా ఎంజాయ్ చేసారని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఇంతటి బూతు పాట, సాహిత్య కళాకారులు సిగ్గు పడే తరహా, ఒకడు పరువు తీస్తూ పాట పాడుతుంటే, అందరూ చోద్యం చూస్తున్నారు తప్ప, ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. సీనియర్ హీరో జేడీ చక్రవర్తి కూడా అదే ఈవెంట్ లో ఉన్నాడు. ఎంతో గొప్ప మందితో ఆయన పని చేసాడు, ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన కెరీర్ లో ఉన్నాయి, అలాంటి వ్యక్తి ఇలాంటి పాటలు పాడే మనుషులు తారసపడినప్పుడు మందలించాలి. కానీ అలాంటిదేమి చెయ్యలేదు, పైగా చప్పట్లు కొడుతూ స్వాగతిస్యున్నాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
హద్దులు దాటిన హీరో చంద్రహాస్ కొత్త పాట
సీరియల్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టేజ్‌పై అసభ్యకరమైన పాట
మహిళలు ఉన్నారని కూడా చూడకుండా అత్యంత దారుణమైన పాట పాడిన చంద్రహాస్
సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి సమక్షంలోనే వికృత చేష్టలు
తెలుగు సినిమా పాట… pic.twitter.com/c40kDH6JaI
— BIG TV Breaking News (@bigtvtelugu) February 3, 2026