Nandamuri Balakrishna: బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న సినిమా పై ఓ లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ కి విలన్ గా హీరో అర్జున్ నటించబోతున్నాడు. నట సింహంకి పోటీగా డైలాగ్ లు చెప్పాలంటే.. అది అర్జున్ లాంటి లీడింగ్ లో ఉన్న హీరోనే కావాలని చిత్రబృందం ఫిక్స్ అయింది. మొదట సంజయ్ దత్ ను ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి.

కానీ సంజయ్ దత్ అంటే బడ్జెట్ సమస్య కాబట్టి, ఆ ఆప్షన్ వదిలేసి అర్జున్ తో ముందుకు వెళ్తుంది టీమ్. బాలకృష్ణ, అర్జున్.. ఒకే సమయంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. పైగా ఇటు బాలయ్యకి అటు అర్జున్ కి మొదటి హిట్ కొట్టింది భార్గవ ఆర్ట్స్ బ్యానర్ లోనే. భార్గవ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించిన ‘మా పల్లెలో గోపాలుడు’ అనే సినిమాతో అర్జున్ హీరోగా నిలబడ్డాడు.
Also Read: వామ్మో సుకుమార్ స్పీడ్ మామూలుగా లేదుగా.. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్!
ఇక ‘మంగమ్మగారి మనవడు’ సినిమాతో బాలయ్య ఘన విజయం సాధించాడు. అన్నట్టు వీరిద్దరికీ మొదటి హిట్లు ఇచ్చిన దర్శకుడు కూడా ఒక్కరే. ఆ దర్శకుడే కోడి రామకృష్ణ. ఇక తెలుగులో బాలయ్య చేసిన ‘నరసింహనాయుడు’ సినిమాని అర్జున్ తమిళంలో రిమేక్ చేసి భారీ హిట్ కొట్టాడు. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారు.
నిజానికి ఈ సినిమాలో డా రాజశేఖర్ ను మొదట విలన్ గా అనుకున్నారు. ఇతర భాషల్లో కూడా కొంచెం ఫేమ్ ఉన్న హీరో అయితే బెటర్ అని ఈ రోల్ కోసం అర్జున్ ను తీసుకున్నారు. ఇక ‘అఖండ’ తర్వాత బాలయ్య రేంజ్ మారిపోయింది. నిజానికి బాక్సాఫీస్ వద్ద బాలయ్యకు అసలు రేంజ్ లేదు అని అఖండ ముందు వరకూ కొంతమంది కామెంట్స్ చేసేవారు.
అయితే, ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించినా బాలయ్య వంద కోట్ల మార్క్ ను దాటాడు. ఇక నుంచి బాలయ్య నుండి ఎక్కువ యాక్షన్ ఆశిస్తారు. కాబట్టి గోపీచంద్ తన స్క్రీన్ ప్లేలో యాక్షన్ ను ఫుల్ గా దట్టించాడట.
Also Read: 2021 ఏడాది ఏయే హీరోయిన్లకు కలిసొచ్చింది?