ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌లు ఎవరి మాట వినని ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు పరిస్థితులు అనుకూలించడంతో పనులు చకచకా సాగుతున్నాయి. అయితే ఆంధ్ర సీఎం జగన్‌కు మాత్రం కొన్ని అనుకూలించడం లేదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
కొన్ని ప్రాధాన్యత సంతరించుకున్న విషయాల్లో జగన్ పూర్తిగా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆసలేం జరగుతోంది..? అన్న ఆలోచనలో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రతీ విషయాన్ని జగన్ నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇతరుల చేత చెప్పించడంతో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందా..? అన్న సందేహం కలుగుతుంది.
Also Read: రాయలసీమకు కేంద్రం అన్యాయం.. జగన్ ఏం చేయబోతున్నాడు?
ఇటీవల పలుమార్లు ఢిల్లీ వెళ్లిన జగన్ ఎందుకు వెళ్లాడు..? అనే విషయంపై మీడియాలో, జనాల్లో తీవ్రంగా చర్చ సాగింది. అయితే ఏపీ సీఎం మాత్రం ఏవిధంగా స్పందించలేదు. ఇక ఇళ్లపట్టాల పంపిణీని ప్రారంభించే దశలోనే ఆ కార్యక్రమం నిలిచిపోయింది. దీనికి గల కారణాలు తెలియక జనాలు ఆగమవుతున్నారు. ఆ మధ్య ‘జగనన్న విద్యాకానుక’ అనే కార్యక్రమం కూడా ఇలా మధ్యలోనే నిలిచిపోవడంతో సంక్షేమ కార్యక్రమాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
జగన్ మాత్రం వెంటవెంట కొత్త కార్యక్రమాలకు ప్రారంభించుకుపోతున్నారు. అయితే అవి సక్రమంగా ప్రజల్లోకి చేరుతున్నాయా..? లేదా..? అనేది మాత్రం చూడడం లేదు. దీంతో సగటు పేదలకు ఆ ఫలాలు అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక పార్టీలోని నాయకులు ఎంతసేపు ప్రతిపక్షాలతో మాటల యుద్ధం చేయడం తప్ప ప్రభుత్వ పథకాలు నిలిచిపోవడంపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇది మెల్లమెల్లగా జగన్ ప్రభుత్వంపై నమ్మకం పోయే ప్రమాదం ఉందని సీనియర్ రాజకీయ నాయకులు హెచ్చరిస్తున్నారు.
Also Read: బాబు కాలదన్నాడు.. జగన్ అందలమెక్కించాడు!
కరోనా సమయంలో పదే పదే ప్రెస్‌మీట్లు పెట్టిన జగన్ ఆ తరువాత వాటికి దూరంగా ఉంటున్నారు. కొందరు తనపై ఉన్న కేసుల విషయంలో జగన్ ఢిల్లీ వెళుతున్నారని అంటుండగా.. మంత్రులు మాత్రం పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురావడానికే పోరాడుతున్నారంటున్నారు. అయితే ఢిల్లీ వెళ్లిన తరువాత జగన్ ఎలాంటి ప్రెస్‌మీట్ పెట్టకపోవడంతో ఈ విషయంపై రకరకాలుగా అనుకుంటున్నారు. మరోవైపు అంతర్వేది ఘటనపై ఇప్పటికీ జగన్ స్పందించకపోవడంతో హిందుత్వవాదుల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇలా జగన్ ఎంతకాలం మౌనంగా ఉంటాడో తెలియక అటు పార్టీ నాయకులు, ఇటు ఆంధ్ర ప్రజలకు అర్థం కావడం లేదు.