Naa Anveshana: సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్స్ వేసుకునే దుస్తుల గురించి రీసెంట్ గా సినీ నటుడు శివాజీ(Actor sivaji) ‘దండోరా'(Dandora Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటల గురించి గత రెండు మూడు రోజులుగా సినీ సెలబ్రిటీలు ఏ రేంజ్ లో అయనపై విరుచుకుపడుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్ళూ ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి నువ్వు ఎవరు అసలు? అని శివాజీ పై మండిపడుతున్నారు. శివాజీ కూడా ‘వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటే నాకు ఎందుకు. నేను కేవలం నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను ఒక తండ్రి లాగా, అంతకు మించి ఏమి లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే శివాజీ పై నిన్న కొణిదెల నాగబాబు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం గమనార్హం. యాంకర్ అనసూయ, చిన్మయి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు అయితే నాన్ స్టాప్ గా శివాజీ ని తిడుతూనే ఉన్నారు.
ఇదంతా పక్కన పెడితే సమాజం లో జరిగే సంఘటనల గురించి ఎలాంటి ఫిల్టర్ లేకుండా, తన మనసులోని మాటలను చాలా బోల్డ్ గా చెప్పుకొచ్చే ‘నా అన్వేషణ'(Naa Anveshana) కూడా శివాజీ పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ శివాజీ ఎంత దొంగ లం** కొడుకు అంటే, పదవ తరగతి ఫెయిల్ అయిన పనికిమాలినోడు ఆడవాళ్ళూ ఎలా ఉండాలో చెప్పడం, మీరు వినడం. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం వాడు చేస్తున్న రాజకీయం. ఈ లం* కొడుకుని ఎక్కడుంటే అక్కడ పీక నరకాలి. ఎందుకంటే వేడిని రాజకీయాల్లో జనాలు చితక్కొట్టారు. ఆ దెబ్బకు పది సంవత్సరాలు అజ్ఞాతం లోకి వెళ్ళిపోయి, మళ్లీ ఈమధ్య సినిమాల్లోకి వచ్చి, మంగపతి అంటూ యాక్టింగ్ చేస్తున్నాడు. ఆడవాళ్ళూ ఊరుకుంటే మాత్రం ఇలాంటోళ్ళు ప్రతీ సినిమా ఈవెంట్ కి వచ్చి ఆడవాళ్ళూ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అంటారు’.
‘అసలు వీడు ఎవడండీ ఆడపిల్లల గురించి చెప్పడానికి. శ్రీదేవి, జయసుధ లాంటి వాళ్ళని పోలుస్తూ ఏదోఏదో మాట్లాడుతున్నాడు. సిల్క్ స్మిత, జయమాలిని లాంటి వాళ్ళని మన తెలుగోళ్లు ఆదరించలేదా?, సినిమా రంగం లో ఉన్న తర్వాత అలాగే ఉండాలి. ఒళ్ళంతా కప్పుకొని చూస్తే ఎవరు సినిమా చూస్తారు’ అంటూ రెచ్చిపోయాడు నా అన్వేషణ. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో మీరే ఈ క్రింది వీడియోలో చూడండి. వీడియో మొత్తం సంస్కృత బాషలోనే ఉంది. వినేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. గమ్మత్తు ఏమిటంటే శివాజీ ‘నా అన్వేషణ’ కి చాలా పెద్ద అభిమాని. బిగ్ బాస్ సీజన్ 7 లోకి వెళ్లేముందు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు. ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ శివాజీ న ఒక ప్రశ్న అడుగుతూ ‘మీకు బాగా ఇష్టమైన యూట్యూబర్ ఎవరు’ అని అడగ్గా, దానికి శివాజీ సమాధానం చెప్తూ ‘నా అన్వేషణ అమ్మా…వాడి వీడియోస్ కి నేను వీరాభిమానిని’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎవరి గురించి అయితే శివాజీ గొప్పగా మాట్లాడాడో, ఇప్పుడు అతని నుండే చెవుల్లో నుండి రక్తం వచ్చే రేంజ్ బూతులు తిట్టించుకున్నాడు.
Dey #ShivajiComments
pic.twitter.com/NIApwRFiVe— Suryakantham (@katthithee) December 27, 2025