Prabhas And Chiranjeevi: బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో టాప్ హీరోగా ఎదిగిన నటుడు ప్రభాస్… ప్రస్తుతం ఆయన మారుతి డైరెక్షన్లో ‘రాజాసాబ్’ సినిమా చేశాడు…ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్ గా నిర్వహించారు… భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది అంటూ మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. మారుతి తన ఎంటైర్ కెరీర్ లో స్టార్ హీరోతో సినిమా చేయడం ఇదే మొదటిసారి…గతంలో వెంకటేష్ తో ‘బాబు బంగారం’ లాంటి సినిమాలు చేసినప్పటికి వెంకటేష్ ను సీనియర్ హీరోగా పరిగణిస్తున్నాం…కాబట్టి ఇప్పుడున్న స్టార్ స్టార్ హీరోల్లో ప్రభాస్ తో మాత్రమే మారుతి సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. ఇక మొత్తానికైతే సంక్రాంతికి తన సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న ఇతర హీరోల సినిమాలను కూడా సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుకున్నాడు. అలాగే సీనియర్స్ ముందు… వాళ్ల నుంచే మేము చాలా నేర్చుకున్నాం అంటూ ప్రభాస్ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడాడు.
నిజానికి ప్రభాస్ ప్లస్ లో ఏ హీరో ఉన్నా కూడా అలాంటి వ్యాఖ్యలు చేసేవాడు కాదేమో, కానీ ప్రభాస్ కి చిరంజీవి అంటే చాలా ఇష్టం అందుకే ఆయన అలాంటి కామెంట్స్ చేశాడు అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం చిరంజీవి అనే కాదు ప్రభాస్ తో పోటీకి ఏ హీరో ఉన్నా ప్రభాస్ వాళ్ళను గౌరవిస్తుంటాడు. తన తోటి హీరోలంటే కూడా ప్రభాస్ కి రెస్పెక్ట్ ఉంటుంది.
నిజానికి ప్రభాస్ వాళ్ల పెదనాన్న కృష్ణంరాజు తర్వాత చిరంజీవి అంటేనే ఆయన కి ఎక్కువ ఇష్టం… చిన్నప్పటినుంచి అతని సినిమాలు చూసుకుంటూ వచ్చానని అందువల్లే చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టమని ప్రభాస్ పలు సందర్భాల్లో తెలియజేశాడు…
మొదటినుంచి చిరంజీవి అభిమానిగా ఉండటంవల్లే చిరంజీవి మీద అమితమైన గౌరవం పెరిగింది. ఇక ఇప్పుడు సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికి చిరంజీవి గారి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని ప్రభాస్ కోరుకుంటున్నాడు. మొత్తానికైతే ప్రభాస్ చాలా మంచి మనసున్న వ్యక్తి అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు…