https://oktelugu.com/

అనుష్క పెళ్లి.. ఈ సారి నమ్మే విధంగానే.. !

స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క ఇరవై ఏళ్ల క్రితమే పెళ్లి ఈడుకొచ్చేసింది. కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఉండి ఉంటే అనుష్క కూతురు కూడా ఈ పాటికి హీరోయిన్ అయి ఉండేది అని సోషల్ మీడియాలో అనుష్క మీద నెటిజన్లు బోల్డ్ అండ్ చెత్త జోక్స్ కూడా ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారు. ఇక అనుష్క వివాహం విషయంలో ఇప్పటికే పలుమార్లు రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఏ ఒక్కటీ నిజం కాలేదు. అయితే […]

Written By:
  • admin
  • , Updated On : June 25, 2020 / 07:19 PM IST
    Follow us on


    స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క ఇరవై ఏళ్ల క్రితమే పెళ్లి ఈడుకొచ్చేసింది. కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఉండి ఉంటే అనుష్క కూతురు కూడా ఈ పాటికి హీరోయిన్ అయి ఉండేది అని సోషల్ మీడియాలో అనుష్క మీద నెటిజన్లు బోల్డ్ అండ్ చెత్త జోక్స్ కూడా ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారు. ఇక అనుష్క వివాహం విషయంలో ఇప్పటికే పలుమార్లు రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఏ ఒక్కటీ నిజం కాలేదు. అయితే కొన్ని నెలలుగా అనుష్క పెళ్లి పై ఒక రూమర్ మాత్రం బాగా హల్ చల్ చేస్తోంది. అనుష్క వివాహం చేసుకోబోయే వరుడు టాలీవుడ్ సీనియర్ దర్శకుడి కుమారుడు అంటూ గతంలో పుకార్ల కంటే బలంగా ఈ రూమర్ కొన్ని నెలలుగా చక్కర్లు కొడుతుండటం విశేషం.

    నిమ్మగడ్డ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ ఆంధ్రా బీజేపీ..!

    ఇప్పుడు మరో రూమర్ కూడా అనుష్క పెళ్లి పై వినిపిస్తోంది. తన బంధువుల అబ్బాయినే అనుష్క పెళ్లి చేసుకోబోతుందని.. పెళ్లి ఆగస్టులో ఉండే అవకాశం ఉందని లేటెస్ట్ రూమర్ సారాంశం. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అనుష్కనే క్లారటీ ఇవ్వాలి. అన్నట్టు ప్రభాస్ తో సహా ఇంకో యువ హీరో పేరును కూడ అనుష్కతో లింక్ చేసి రూమర్స్ రాశారు రాతల రాయుళ్లు. కానీ అవేవీ వాస్తవం కాదని త్వరగానే తేలిపోయాయనుకోండి. అయితే తాజాగా అనుష్క పెళ్లి విషయంలో వస్తోన్న గాసిప్ పెద్ద ఎత్తులో గుప్పుమనడం.. అది నమ్మే విధంగా ఉండటంతో అదే నిజం అనుకునే పరిస్థితి వచ్చింది.

    ఏది ఏమైనా అనుష్క త్వరగా పెళ్లి చేసుకునే దాకా సోషల్ మీడియాలో ఈ రూమర్లు ఆగవు. అనుష్క పెళ్లి అంటూ డీటైలింగ్ ఇస్తూ ఎవడొకడు ఏదొకటి పుట్టిస్తూనే ఉంటాడు. ఇకపోతే అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ విడుదలకు సిద్ధంగా ఉన్నా.. విడుదల అయ్యే పరిస్థితులు కనబడటం లేదు.