https://oktelugu.com/

Digital Media : ఖర్చు తడిసి మోపెడవుతోంది: డిజిటల్ బాటలోకి ఆంధ్రజ్యోతి

Digital Media : మొన్న మనం చెప్పుకున్నాం కదా ఆంధ్రజ్యోతి డిజిటల్ బాట పట్టబోతోంది అని.. అది కూడా దిశ పేపర్ లాగానే డైనమిక్ ఎడిషన్లు పబ్లిష్ చేయబోతోంది అని.. దీనికి ముందు తెలంగాణలో వేసినప్పటికీ… హైదరాబాద్, వరంగల్ జిల్లాలో మీటింగ్ లు పెట్టినప్పటికీ.. ఆంధ్రలోనే మొదట ప్రారంభించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పనిచేసే సబ్ ఎడిటర్లకి సంకేతాలు ఇచ్చారట! త్వరలోనే డిజిటల్ ఎడిషన్ కి పేపర్ మారుతోంది. దీనికి మీరంతా సంసిద్ధులు కావాలని ఆదేశాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 25, 2023 12:46 pm
    Follow us on

    Digital Media : మొన్న మనం చెప్పుకున్నాం కదా ఆంధ్రజ్యోతి డిజిటల్ బాట పట్టబోతోంది అని.. అది కూడా దిశ పేపర్ లాగానే డైనమిక్ ఎడిషన్లు పబ్లిష్ చేయబోతోంది అని.. దీనికి ముందు తెలంగాణలో వేసినప్పటికీ… హైదరాబాద్, వరంగల్ జిల్లాలో మీటింగ్ లు పెట్టినప్పటికీ.. ఆంధ్రలోనే మొదట ప్రారంభించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పనిచేసే సబ్ ఎడిటర్లకి సంకేతాలు ఇచ్చారట! త్వరలోనే డిజిటల్ ఎడిషన్ కి పేపర్ మారుతోంది. దీనికి మీరంతా సంసిద్ధులు కావాలని ఆదేశాలు జారీ చేశారట! అంతే కాదు ఇప్పుడు ఉన్న మ్యాన్ పవర్ ను సగానికి సగం తగ్గించే సూచనలు ఉన్నాయని చెప్పారట. అంటే ఒక ఎడిషన్ లో నలుగురిని మాత్రమే ఉంచుతారు. వారంతా కూడా ఇంటి నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఇక నెట్వర్క్ విషయానికొస్తే వార్తలు ఎప్పటిలాగే ఇవ్వాల్సి ఉంటుంది.

    వాట్సాప్ నుంచి కన్వర్ట్

    మొన్నటి దాకా అను ఫాంట్స్ వాడిన ఆంధ్రజ్యోతి.. ఇప్పుడు సొంతంగా ఫాంట్స్ క్రియేట్ చేసుకుంది. సాఫ్ట్వేర్ కూడా రూపొందించింది. అంతేకాదు పేజీలు మొత్తం పూర్తయిన తర్వాత సబ్ ఎడిటర్లతోనే వెబ్ ఎడిషన్ కి వార్తలు అప్లోడ్ చేయిస్తోంది. ఇప్పుడు పూర్తిగా డిజిటల్ ఫార్మాట్లోకి మారుతున్న నేపథ్యంలో.. రిపోర్టర్లు వాట్సాప్ ద్వారా వార్తలు పంపిస్తే.. వాటిని ఆంధ్రజ్యోతి ఫాంట్స్ లోకి కన్వర్ట్ చేసుకునే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైజాగ్లో దీనికి సంబంధించి టెస్టింగ్ ప్రక్రియ కూడా సాగుతున్నట్టు సమాచారం.

    ప్రింట్ మీడియా లో ఖర్చులు బాగా పెరిగిపోవడం, రెవెన్యూ తగ్గిపోవడంతో ఆంధ్రజ్యోతి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో జగన్ తో పడకపోవడంతో ప్రభుత్వపరంగా యాడ్స్ రావడం లేదు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ కొంతలో కొంత నయంగా రెవెన్యూ వస్తోంది. మరోవైపు చంద్రబాబు నుంచి వచ్చే ప్యాకేజీల పరిమాణం తగ్గినట్టు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ భారం మోయలేక రాధాకృష్ణ డిజిటల్ వైపు మళ్ళుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే డెస్క్ లో పనిచేసే సిబ్బందికి మౌఖికంగా ఆదేశాలు వెళ్లిపోయాయి.. అయితే ఇందులో బెటర్ గా పేజీలు పెట్టే వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.. కోవిడ్ టైంలో చాలామందిని ఇళ్లకు పంపించిన ఆంధ్రజ్యోతి.. ఇప్పుడు ఉన్న సిబ్బందిలో సగం మందికి ఉద్వాసన పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.. సో మొత్తానికి ఆంధ్రజ్యోతి డిజిటల్ దారిలో దిశవైపు సాగుతోంది.