Anchor Vishnupriya : విష్ణుప్రియ భీమనేని పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పటి ఈ యాంకర్ నటిగా బిజీ అవుతుంది. విష్ణుప్రియ గతంలో యూట్యూబ్ వీడియోలు చేసేది. పోవే పోరా షోతో యాంకర్ గా మారింది. సుడిగాలి సుధీర్ తో పాటు ఆ యూత్ఫుల్ షోని పరుగులుపెట్టించింది. మెల్లగా బుల్లితెర స్టార్ గా ఆమె ఎదిగారు. అయితే యాంకరింగ్ మీద విష్ణుప్రియ ఎక్కువ దృష్టి పెట్టలేదు. నటిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు.
ఈ మధ్యకాలంలో విష్ణుప్రియకు చెప్పుకోదగ్గ రోల్స్ వచ్చాయి. గత ఏడాది ఆమె వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో ఓ పాత్ర చేసింది. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా పండుగాడ్ తెరకెక్కింది. అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ వంటి స్టార్స్ నటించిన వాంటెడ్ పండుగాడ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాగా దయ వెబ్ సిరీస్లో విష్ణుప్రియ కీలక రోల్ దక్కించుకుంది.
జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలు చేశారు. జోష్ రవి మరో కీలక పాత్రలో అలరించాడు. దయ సిరీస్లో లేడీ జర్నలిస్ట్ గా ఆమెది ఫుల్ లెంగ్త్ రోల్. ఓ పవర్ఫుల్ పాత్రకు విష్ణుప్రియ చక్కగా సెట్ అయ్యింది. దయ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీ అవార్డ్స్ లో దయ డైరెక్టర్ పవన్ సాధినేని అండ్ హీరో జెడీ చక్రవర్తి అవార్డ్స్ కొల్లగొట్టారు. దీంతో ఆమె ఆనందం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే విష్ణుప్రియ షేర్ చేసిన ఓ రీల్ చర్చకు దారి తీసింది. సదరు రీల్ ఆమె అనారోగ్యానికి గురయ్యారన్న అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఓ సాంగ్ పోస్ట్ చేసిన విష్ణుప్రియ ‘మానసిక ఆరోగ్యం ఖరాబ్, శారీరక ఆరోగ్యం ఖరాబ్, రిలేషన్షిప్ ఖరాబ్, షెడ్యూల్స్ ఖరాబ్, కెరీర్ ఖరాబ్… అయినా ఇలా చిల్ అవుతున్నా’ అని పోస్ట్ పెట్టింది. దీంతో విష్ణుప్రియ వేదనలో ఉంది. ఆమె ఆరోగ్యంతో పాటు మొత్తంగా కోల్పోయారనే సందేహాలు కలుగుతున్నాయి…