Anasuya Bharadwaj : అనసూయ భరధ్వాజ్ జబర్దస్త్ షో ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించింది. తక్కువ సమయంలోనే సెన్సేషన్ గా మారింది. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా అగ్ర నాయకులు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది. ఇటీవల అనసూయ విమానం సినిమాలో బోల్డ్ పాత్రలో మెప్పించింది. కాగా పర్సనల్ లైఫ్ లో కూడా అనసూయ తన భర్త పిల్లలతో చాలా సంతోషంగా ఉంది.
అనసూయ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె లవ్ స్టోరీ లో ఎన్నో ట్విస్టులు, కష్టాలను ఎదుర్కొంది. తొమ్మిదేళ్లు ఇంట్లో వాళ్లతో పోరాడి లవ్ మ్యారేజ్ చేసుకుంది. అనసూయ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో ఎన్ సీ సీ క్యాంప్ కు వెళ్లిందట. అక్కడే మొదటి సారి సుశాంక్ భరద్వాజ్ ని కలిసిందట. అతనితో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య ప్రేమ చాలా ఏళ్ళు సాగిందట. సుశాంక్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అనసూయ ని అడిగాడట. వెంటనే వర్షం వచ్చిందట.
ఇక వీళ్ళ ప్రేమ పీక్స్ లో ఉండగా .. అనసూయ తండ్రి ఆమెకు ఒక పెళ్లి సంబంధం తెచ్చాడట. అతడు పైలెట్ అట. మంచి ఉద్యోగం, ఆస్తిపరుడు చేసుకుంటే సుఖపడతావని చెప్పాడట. దాదాపు సంబంధం నిశ్చయం అయిపోగా .. అనసూయ తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా చాలా పెద్ద గొడవ జరిగిందట. తండ్రి ఆమెను బయటకు గెంటేశాడట. ఎంత అడిగినా తండ్రి ఒప్పుకోకపోవడంతో అనసూయ లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని సుశాంక్ ని అడిగిందట.
అలా చేస్తే మనకు గౌరవం ఉండదు కొంత కాలం వెయిట్ చేద్దాం అని నచ్చజెప్పాడట. ఇక అనసూయ మొండి పట్టు పట్టడంతో చేసేదేమి లేక తన తండ్రికి ఇష్టం లేకపోయినా వారి పెళ్లి చేసాడట. కానీ కొంతకాలానికి ఆయన మనసు మార్చుకుని అల్లుడు, పిల్లలతో కలిసిపోయాడట. అలా అనసూయ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రేమించిన వ్యక్తిని భర్తగా తెచ్చుకుందట. గతంలో ఒకటి రెండు సందర్భాల్లో అనసూయ ఈ విషయం వెల్లడించింది.