https://oktelugu.com/

Anantapur Tadipatri Story: ఊరంతా ఖాళీ.. ఏమిటో ఈ క‌థాక‌మామీషు?

Anantapur Tadipatri Story: మ‌నిషి పుట్టుక‌, చావు రెండే విచిత్రాలు అని అంద‌రికి తెలుసు. కానీ లోకంలో చాలా వింత‌లు జ‌రుగుతుంటాయి. వాటి గురించి తెలుసుకుంటే మ‌న‌కు విచిత్ర‌మే క‌లుగుతుంది. కంప్యూట‌ర్ యుగంలో కూడా అంధ విశ్వాసాలు అంద‌ల‌మెక్కించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తే మ‌న‌కే న‌ష్టం. కొన్ని ఆచారాలు చూస్తుంటే మ‌న‌కు ఔరా అనే అనుమానం కూడా క‌లుగుతోంది. ఇక్క‌డ మ‌నం చెప్పుకోబోయే ఆచారం వింటే మీరే ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వుతారు. వింత‌లు, విడ్డూరాలు చెప్పుకోవ‌డానికేగా ఉంది అని మ‌నం కూడా […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 19, 2022 / 05:14 PM IST
    Follow us on

    Anantapur Tadipatri Story: మ‌నిషి పుట్టుక‌, చావు రెండే విచిత్రాలు అని అంద‌రికి తెలుసు. కానీ లోకంలో చాలా వింత‌లు జ‌రుగుతుంటాయి. వాటి గురించి తెలుసుకుంటే మ‌న‌కు విచిత్ర‌మే క‌లుగుతుంది. కంప్యూట‌ర్ యుగంలో కూడా అంధ విశ్వాసాలు అంద‌ల‌మెక్కించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తే మ‌న‌కే న‌ష్టం. కొన్ని ఆచారాలు చూస్తుంటే మ‌న‌కు ఔరా అనే అనుమానం కూడా క‌లుగుతోంది. ఇక్క‌డ మ‌నం చెప్పుకోబోయే ఆచారం వింటే మీరే ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వుతారు. వింత‌లు, విడ్డూరాలు చెప్పుకోవ‌డానికేగా ఉంది అని మ‌నం కూడా నిట్టూరుస్తాం.

    Anantapur Tadipatri Story

    మాన‌వుడు త‌న మేథ‌స్సుతో అన్ని తెలుసుకుని కొన్నింటిని మాత్రం మ‌రిచిపోయాడు. అస‌లు తాను మ‌నిష‌నే విష‌యం కూడా ఎప్పుడో మ‌రిచిపోయిన‌ట్లు తెలుస్తోంది. అందుకే అప్పుడ‌ప్పుడు త‌న‌లోని రాక్ష‌స‌త్వాన్ని కూడా బ‌య‌ట‌పెడ‌తాడు. సాటి మ‌నిషిని బాధ పెట్టి ఆనందం కూడా పొందుతుంటాడు. మ‌నం ఇక్క‌డ చ‌ర్చించుకునే విష‌యం వింటే మీకు నిజంగానే వింత‌గా అనిపించ‌వ‌చ్చు.

    అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మండ‌లంలోని తలారి చెరువుకు ఆరు వంద‌ల ఏళ్ల చ‌రిత్ర ఉంది. కానీ ఇక్క‌డో ఆచారం ఉంది. ప్ర‌తి సంవత్స‌రం మాఘ‌మాసంలో పౌర్ణ‌మి రోజు ఊరంతా ఖాళీ చేసి వెళ‌తారు. అంటే అన్నింటిని మ‌నుషుల‌తో పాటు జంతువులను కూడా తీసుకెళ‌తారు. అలా వెళ్లి ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు అక్క‌డే ఉండి తెల్ల‌వారి ఊళ్లోకి చేరుకుంటారు. ఆ రోజంతా ఊళ్లో ఒక్క దీపం కూడా వెల‌గ‌దు. ఊరంతా చీక‌టిగా ఉంటుంది.

    Also Read: ఆ ప్రాంతాల్లో కూడా స్టూడియోలు క‌ట్టాలంట‌.. జ‌గ‌న్ పెద్ద ప్లానే వేశారే..!

    అస‌లు ఇది ఎందుకు పాటిస్తున్నారు? ఇందులో ఉన్న విశేష‌మేమిటి అని తెలుసుకోవాల‌ని ఉందా? అయితే వినండి. గ్రామంలోకి ఆరువంద‌ల ఏళ్ల క్రితం ఓ బ్రాహ్మ‌ణుడు వ‌చ్చి ధ‌నం, ధాన్యం దొంగ‌త‌నం చేశాడ‌ట‌. అప్పుడు అత‌డిని గ్రామ‌స్తులంతా క‌లిసి చంపేశార‌ట‌. ఆ స‌మ‌యంలో ఆ బ్రాహ్మ‌ణుడు ఈ ఊరు సుఖ‌శాంతుల‌తో ఉండ‌ద‌ని శ‌పించాడ‌ట‌. త‌రువాత కాలంలో అలాగే జ‌ర‌గ‌డంతో గ్రామ‌స్తులు ఓ స్వామి వారిని క‌లిసి త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నార‌ట‌. దీనికి ప‌రిష్కారం ఏంటి స్వామి అని అడిగితే ఈ విధంగా చెప్పాడ‌ని ప్ర‌తీతి.

    ఇక అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం మాఘ‌మాసంలో వ‌చ్చే పౌర్ణ‌మికి ఊరంతా ఖాళీ చేసి ఊరి బ‌య‌ట ఉన్న ఓ ద‌ర్గాలో త‌ల దాచుకుంటార‌ట‌. దీన్ని కొంద‌రు వ్య‌తిరేకించి న‌మ్మ‌క‌పోవ‌డంతో వారికి కూడా అదే విధంగా న‌ష్టాలు జ‌రగ‌డంతో ఇక అప్ప‌టి నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం ఇలా చేయ‌డం వారికి ఆన‌వాయితీగా వ‌స్తోంది. మ‌నిషిలోని మూఢ‌త్వానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని తెలుస్తున్నా మ‌నం ఏం చేయ‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే మీకెందుకు అనే ప్ర‌శ్న‌లు రావ‌డం స‌హ‌జ‌మే.

    Also Read: జ‌గ్గారెడ్డి రాజీనామాను ఆమోదిస్తుందా? అడ్డుకుంటుందా?

    Recommended Video:

    Tags