Allu Cinemas Hyderabad Launch: హైదరాబాద్ లోని కోకాపేట లో ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ‘అల్లు సినిమాస్'(Allu Cinemas) నేడు ప్రారంభం కానుంది. అమీర్ పేట్ ఇప్పటికే AA సినిమాస్ ని ప్రారంభించి విజయవంతంగా రన్ చేస్తున్న అల్లు అర్జున్ , ఇప్పుడు కోకాపేట లో కూడా ప్రారంభించబోతున్నాడు. నేడు అల్లు అర్జున్ స్వయంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొనబోతున్నారు. ఈ థియేటర్స్ లో డాళ్బీ స్క్రీన్ ఉండబోతుంది. హైదరాబాద్ లోనే మొట్టమొదటి డాళ్బీ స్క్రీన్ గా , సౌత్ లో రెండవ డాళ్బీ స్క్రీన్ గా దీనిని పిలవొచ్చు. 640 సీటింగ్ కెపాసిటీ దీనికి ఉన్నది. థియేటర్ లో వచ్చే ప్రతీ ప్రేక్షకుడు ది బెస్ట్ థియేట్రికల్ అనుభవం తో బయటకి వెళ్లేలా , డాళ్బీ అట్మాస్ సౌండ్ సిస్టం ని కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోనే రాబోయే రోజుల్లో ‘అల్లు సినిమాస్ ‘ అంటే ఒక బ్రాండ్ అని అనిపించేలా చేయడమే లక్ష్యం అట.
Also Read: గూగుల్ డేటా సెంటర్‌పై జగన్ కి ఎందుకంత కడుపుమంట?
అయితే ప్రారంభించేది నేడే అయినప్పటికీ, సినిమాల ప్రదర్శన మాత్రం ఈ నెల 19 నుండే జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఉగాది కానుకగా మార్చి 19 న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తో పాటు, పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ‘ధురంధర్ 2’ కూడా ఈ థియేటర్స్ లో విడుదల కాబోతుంది. అప్పుడే ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా ఈ థియేటర్స్ వద్ద ఏర్పాటు చేశారు. ఆరంభం లోనే రెండు క్రేజీ సినిమాలతో ఈ థియేటర్స్ మొదలు అవ్వడం అనేది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. చాలా అరుదుగా ఇలాంటి సందర్భాలు వస్తుంటాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ లో AMB సినిమాస్ కి మంచి క్రేజ్ ఉంది. ఆ తర్వాత రవితేజ ఆర్ట్ సినిమాస్’ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.
ఈ రెండిటి తర్వాత అమీర్ పేట్ లోనే ‘AA సినిమాస్’ నిల్చింది. ఇప్పుడు కోకాపేట లో మొదలు కాబోతున్న ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్ లో పైన చెప్పిన థియేటర్స్ ని డామినేట్ చేసి టాప్ 1 స్థానం లో నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన అట్లీ తో చేస్తున్న సినిమా షూటింగ్ తాత్కాలిగంగా ఆగింది. గత నెల 22 నుండి అల్లు అర్జున్ తన సోదరుడు అల్లు శిరీష్ పెళ్లి పనుల్లో బిజీ గా గడిపాడు. ఇప్పుడు అదంతా అయిపోవడం తో ఈ నెలాఖరు నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేసే అవకాశం ఉంది .