Allu Arjun And Johnny Master: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాకి రానంత వసూళ్లను ‘పుష్ప 2’ సినిమాతో సాధించి ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదిగిపోయాడు. ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో రాకా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాలను క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం ఆయన క్రేజ్ అమాంతం తారాస్థాయికి వెళ్ళిపోతుంది… ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసిన సినిమాల్లో అతన్ని చాలా వైలెంట్ గా చూపిస్తూ వచ్చారు. ఇకమీదట చేయబోతున్న సినిమాల్లో క్లాస్ మాస్ ఆడియన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ తను సినిమాలు చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పుష్ప సినిమాలో నటించినందుకు గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక అతనితోపాటుగా జానీ మాస్టర్ కి కూడా నేషనల్ అవార్డు అయితే వచ్చింది…
జానీ మాస్టర్ మీద కేసు నమోదు అవ్వడంతో అతనికి వచ్చిన నేషనల్ అవార్డుని వెనక్కి తీసుకున్నారు. నిజానికి జానీ మాస్టర్ మీద అల్లు అర్జున్ కక్ష్య కట్టి మరి ఇలా చేశారంటూ కొంతమంది అప్పట్లో కొన్ని కామెంట్లు చేశారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఆర్ జే శేఖర్ భాష ఒక వీడియోనిలను రిలీజ్ చేశారు.
ఆయన మాట్లాడుతూ పుష్ప 2 సినిమా సెట్లో శ్రష్టి వర్మ ఈ సినిమాలో ఒక సాంగ్ ని కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు అందులో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులను ఆమె కాపీ చేసి ఆ సాంగ్ లో వాడుతుందట. ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది డాన్సర్లు జానీ మాస్టర్ కి చెప్పడంతో పుష్ప 2 సినిమా సెట్ కి వెళ్లి జానీ మాస్టర్ గొడవ చేశారట. దాంతో అల్లు అర్జున్ కి కోపం వచ్చి జానీ మాస్టర్ మీద ఫైర్ అయ్యారట.
ఇక అల్లు అర్జున్ ను అమితంగా ఇష్టపడే తన చుట్టూ ఉన్నవాళ్ళెవరో తెలుగులో నేషనల్ అవార్డు అల్లు అర్జున్ ఒక్కడికి మాత్రమే ఉండాలి అనే దృక్పథంతో ఆలోచించి జానీ మాస్టర్ మీద శ్రష్టి వర్మ తో కేసు పెట్టించి మరి ఆ అవార్డును వెనక్కి తీసుకునేలా ప్రణాళికలు రూపొందించారని అందులో వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారని శేఖర్ భాష చెబుతున్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
