Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు… కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణను పొందుతాయి. కాబట్టి వాళ్లకు ఎక్కువ ఇమేజ్ ఉంటుంది. తద్వారా వాళ్ళ సినిమాలకు మొదటి రోజు కలెక్షన్స్ గాని అలాగే లాంగ్ రన్ లో ఆ సినిమాలు సాధించే విజయాలు కానీ చాలా పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక పాన్ ఇండియాలో ‘పుష్ప 2’ టాప్ హీరోగా తన కంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి విజయకేతనాన్ని ఎగరవేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ మూవీ తర్వాత లోకేష్ కనకరాజు డైరెక్షన్లో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు… ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ తనకున్న క్రేజ్ ను వాడుకుంటూ సూపర్ సక్సెస్ లను సాధించినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ లో నెంబర్ వన్ పొజిషన్ ని అందుకోగలుగుతాడు.
లేకపోతే మాత్రం మరోసారి తను డీలా పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా ఇచ్చిన హైప్ తో టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆయనున్న పరిస్థితిలో సక్సెస్ ల పరంపర ను కంటిన్యూ చేస్తూ వరుసగా మరో మూడు విజయాలు సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఆ మూడు విజయాలతో తనను తాను ప్రూవ్ చేసుకున్నట్లయితే మాత్రం అతన్ని ఆపేవారు ఎవరు ఉండరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఆయన టాప్ హీరోగా మారిపోతాడు.
ఇండియాలో తనను బీట్ చేసే హీరోలు కూడా ఎవరు ఉండరు అనేది వాస్తవం… ఇక రాబోయే మూడు సినిమాలతో సక్సెస్ లను సాధిస్తే మాత్రం అతడి కెరియర్ మరొక రేంజ్ లో ఉంటుంది. లేకపోతే మాత్రం మిగతా హీరోలు అతన్ని డామినేట్ చేసి ముందుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి… ఇక అల్లు అర్జున్ కెరియర్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మరొక రెండు మూడు సంవత్సరాల పాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…
