Oneplus 16 Pro 5G: ప్రస్తుతం మొబైల్స్ కొనాలని అనుకునేవారు ఎక్కువగా కెమెరా పనితీరుతో పాటు బ్యాటరీ వ్యవస్థపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారులకు అనుగుణంగా కంపెనీలు సైతం కెమెరా, బ్యాటరీలను ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే One Plus కంపెనీ నుంచి ఇప్పటికే మెరుగైన కెమెరా ఉన్న మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఆకట్టుకునే డిస్ప్లే తో పాటు నాణ్యమైన ఫోటోలను అందించే కెమెరాతో కూడిన మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
వన్ ప్లస్ కంపెనీ నుంచి 16 ప్రో 5జి ఫోన్ మార్కెట్లో ఆకట్టుకుంటుంది. ఈ మొబైల్ డిస్ప్లే అదరహో అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇది 6.82 అంగుళాల LTPO AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కావాలని అనుకునే వారితోపాటు.. గేమింగ్ ఎక్కువగా కోరుకునే వారికి కూడా ఇవి అనుగుణంగా ఉంటుంది. ఈ మొబైల్లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 50 MP మెయిన్ కెమెరా ఉండడంతోపాటు అల్ట్రా వైడ్, టెలిఫోటో కూడా ఇదే మెగాపిక్సులతో పనిచేస్తుంది.50 MP ఫ్రంటు కెమెరా కూడా ఉండడంతో సెల్ఫీలు కావాలని అనుకునే వారితో పాటు వీడియో కాల్ చేసుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుతం యూత్ సైతం కెమెరా విషయంలో కేర్ తీసుకోవడంతో ఈ ఫోన్ వారికి బాగా నచ్చుతుంది అని అంటున్నారు.
వన్ ప్లస్ ఈ కొత్త మొబైల్ లో బ్యాటరీ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 7500 mAh బ్యాటరీని చేర్చారు. ఇది ఫాస్టెస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేయడంతో రోజువారి వినియోగం చేసే వారికి.. గేమింగ్ కోసం ఎక్కువగా యూజ్ చేసే వారికి బ్యాటరీ సేవ్ కానుంది. అంతేకాకుండా డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో ఎక్కువసేపు చార్జింగ్ ఉండే అవకాశం ఉంది. అలాగే బిజీ వాతావరణం లో ఫాస్ట్ గా చార్జింగ్ కావడానికి ఇది సపోర్ట్ చేస్తుంది.
వన్ ప్లస్ సిక్స్ ప్రో మొబైల్ లో ఆక్సిజన్ ఓఎస్ 16 సాఫ్ట్వేర్ తో పని చేసే అవకాశం ఉంది. అలాగే ఇందులో ఫీచరింగ్ ఫ్లెక్స్ థీమ్ 2.0, ప్రైవేట్ కంప్యూటింగ్ క్లౌడ్ వంటి సాఫ్ట్వేర్లు ఇందులో అమర్చారు. ఈ మొబైల్లో 12 జిబి రామ్ ఉండడంతో పాటు 512 GB స్టోరేజ్ ఉండడంతో కావలసిన ఫోటోలను, వీడియోలను ఇందులో స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారు దీనిని వారికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఈ మొబైల్ వైఫై 7 కలెక్టివిటీతోపాటు ఫాస్ట్ గా 5జి నెట్వర్క్ కనెక్ట్ అయ్యేవిధంగా సెటప్ చేశారు.
