Adivi Sesh Remuneration: ‘ క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని మొదలు పెట్టి , ఆ తర్వాత నేడు హీరో గా మారి, నేడు టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యాంకబుల్ హీరోగా , అడివి శేష్(Adivi Sesh) తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని , బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. క్షణం , ఎవరు, గూడాచారి, మేజర్, హిట్ 2 , ఇప్పుడు లేటెస్ట్ ‘డెకాయిట్'(Dacoit Movie) వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న అడివి శేష్, తన తదుపరి చిత్రానికి రెమ్యూనరేషన్ భారీ గా పెంచేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అడివి శేష్ సినిమా అంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ బిజినెస్ అవలీలగా 70 కోట్ల రూపాయలకు జరిగిపోతుంది. ఇంత బిజినెస్ జరుగుతుంది కాబట్టి, ఆయన రెమ్యూనరేషన్ ని కూడా భారీగా పెంచేసాడు.
ఇకపై అడివి శేష్ ఒక్కో సినిమాకు 20 నుండి 25 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఆయన ‘లిటిల్ హార్ట్స్’ మూవీ డైరెక్టర్ సాయి మార్తాండ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. లవ్ స్టోరీ జానర్ లో తెరకెక్కే సినిమా కోసం అడివి శేష్ దాదాపుగా 25 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేశాడట. అంతే కాకుండా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గూడ చారి 2’ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సుమారుగా 100 కోట్ల రూపాయిలు ఈ చిత్రం కోసం ఖర్చు చేస్తున్నారు. అందుకే రెమ్యూనరేషన్ గా లాభాల్లో వాటాలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట అడివి శేష్. ఒకవేళ సినిమా సూపర్ హిట్ గా నిల్చి 200 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు, 120 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లను రాబట్టి , నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా 70 కోట్ల రూపాయిల రేంజ్ లో జరిగితే , అందులో అడివి శేష్ 25 శాతం వాటాలు తీసుకునే అవకాశం ఉంది.
అంటే 50 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఉంటుంది అన్నమాట. సినిమా సినిమాకు తన మార్కెట్ ని పెంచుకోవడమే కాకుండా, ప్రతీ సినిమాకు స్టోరీ , స్క్రీన్ ప్లే కూడా అందిస్తూ ఉంటాడు అడివి శేష్. నటన తో పాటు , ఇతర క్రాఫ్ట్స్ లో కూడా తన పనితనం చూపిస్తూ, నిర్మాతకు ఖర్చు తగ్గిస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోవడం లో తప్పు లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రాబోయే రోజుల్లో అడివి శేష్ ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వేళ్తాడో చూడాలి.