Naresh Homam : తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించారు. తండ్రి పాత్రలో నటిస్తూ ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారనడంలో అతిశయోక్తి లేదు.

అలనాటి నటి విజయనిర్మల కుమారుడు అయిన నరేశ్ తన నటనతో, ప్రత్యేకమైన శైలితో తనదైన మార్క్ ను ప్రేక్షకుల మదిలో వేసుకున్నారు. ‘పండంటి కాపురం ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు నరేశ్. తరువాత తల్లి విజయ నిర్మల డైరక్షన్ లో వచ్చిన ప్రేమ సంకెళ్లు సినిమాతో హీరోగా మారారు. అయితే అనుకున్న విజయాన్ని ఆ చిత్రం సాధించలేకపోయింది. తరువాత పిఎన్ రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం భళారే చిత్రంతో నరేశ్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత కామెడీ హీరోగా, అనంతరం తండ్రి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
విజయనిర్మల కన్నుమూసిన తరువాత నరేశ్ తన మూడో పెళ్లి విషయంలో తరచూ వార్తల్లో నిలిచారు. తన భార్య రమ్య రఘుపతితో విడాకుల వ్యవహారంతో పాటు సహానటి అయినా పవిత్ర లోకేశ్ ను మళ్లీ పెళ్లి చేసుకుంటారనే వార్తలు అప్పటిలో తెగ హల్ చల్ చేశాయి. దీంతో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారన్న సంగతి తెలిసిందే.

తాజాగా సినీయర్ నటుడు నరేశ్ తన ఇంటిలో శాంతి హోమాన్ని నిర్వహించారు. హోమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ఆయన ఓ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ విధంగా టైమ్ స్పెండ్ చేయడం సంతోకరంగా ఉందని తెలిపారు. కాగా నరేశ్ ఇంటిలో నిర్వహించిన శాంతి హోమంలో సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు సోదరి ప్రియదర్శినితో పాటు సీనియర్ నటి జయసుధ పాల్గొన్నారు. వారితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ హోమానికి హాజరయ్యారని తెలుస్తోంది.