Chandramohan Rare Photos : ఒకప్పుడు సినిమాల్లో నటించిన నటుల గురించి మాట్లాడుకుంటే కొంత మంది మాత్రమే గుర్తు వస్తారు. అందులో ముఖ్యమైన వారు చంద్రమోహన్. ఈయన లేకుండా సినిమాలు రావడం కూడా కష్టమే. ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు ఈ నటుడు. కానీ రీసెంట్ గా ఆయన చనిపోయారు అని తెలియగానే అభిమానులు ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు చంద్రమోషన్. ఈయన మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
టాలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రమోషన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఇండస్ట్రీలో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ముందుంటారు ఈయన. ఎవరిని ఒక మాట అనకుండా చాలా సీదాసాదాగా ఉంటారని తెలుస్తోంది. సున్నితమైన వ్యక్తి ఈ నటుడు. అంతే కాదు ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా ఆలోచించకుండా చేస్తారట కూడా. ఇలాంటి మంచి పేరు సంపాదించిన వ్యక్తి దూరం అవడంతో ఆయన అభిమానులు కంటతడి పెడుతున్నారు.
చంద్రమోహన్ కు జోడీగా నటించిన హీరోయిన్లు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారు. ఈయన వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించారు. రంగుల రాట్నం సినిమాతో చంద్రమోహన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. వారికి వివాహాలు కూడా చేశారట. పెద్ద కూతురు మీనాక్షి అమెరికాలో సైకాలజిస్ట్ గా స్థిరపడగా రెండో కూతురు మాధవి చెన్నైలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
చంద్రమోహన్ తొలి సినిమాకే నంది అవార్డు ను అందుకున్నారు. 55 సంవత్సరాల సినీ కెరీర్ లో 932 సినిమాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే గతంలో ఒకసారి ఈయన డబ్బులు దాచుకునే వారికే విలువ ఉంటుందని చెప్పారు. దీంతో ఏదో బాధపడే సన్నివేశం జరిగిందని అనుకున్నారు. కానీ దానికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. ఇదిలా ఉంటే ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. దీంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రమోహన్ సినీ జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ సహా నేటితరం హీరోలతోనూ కనిపించారు. ఆయన సినీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో అరుదైన రేర్ దృశ్యమాలికను కింద చూడొచ్చు.