spot_img
Homeఎంటర్టైన్మెంట్Aamir Khan Missed Role In Dhurandhar: 'ధురంధర్' సిరీస్ లో అమీర్ ఖాన్ మిస్...

Aamir Khan Missed Role In Dhurandhar: ‘ధురంధర్’ సిరీస్ లో అమీర్ ఖాన్ మిస్ చేసుకున్న పాత్ర అదే.. చేసుంటే ఇంకో 1000 కోట్లు అదనంగా వచ్చేవి..

Aamir Khan Missed Role In Dhurandhar: ‘ధురంధర్'(Dhurandhar Movie) సిరీస్ నేడు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందంటే, అందుకు కేవలం డైరెక్టర్ విజన్ ఒక్కటే కారణం కాదు, నటీనటుల అద్భుతమైన నటన కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే నటీనటుల కారణంగానే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఇందులో ప్రతీ ఒక్కరు తమ పాత్రల్లో నటించలేదు, జీవించారు. ముఖ్యంగా మొదటి భాగం లోని రెహమాన్ డెకాయిట్ పాత్ర ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. హీరో పాత్ర రెండు భాగాల్లోనూ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రెండవ భాగం లో రణవీర్ సింగ్ నటనకు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే అవుతుంది. అంత అద్భుతంగా నటించాడు. అయితే ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకర్షించిన మరో అద్భుతమైన పాత్ర అజయ్ సన్యాల్. ప్రముఖ తమిళ హీరో మాధవన్ ఈ పాత్రలో నటించాడు. కెరీర్ లో ఎప్పుడూ కూడా ఆయన ఈ రేంజ్ మేకోవర్ లో కనిపించలేదు.

నిజ జీవితం లో ఈ క్యారెక్టర్ అజిత్ దోవల్ కి సంబంధించినది అనేది మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పని చేస్తున్నాడు. అయితే ఈ క్యారెక్టర్ కోసం ముందుగా ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ని సంప్రదించాడట డైరెక్టర్ ఆదిత్య డర్. కానీ అమీర్ ఖాన్ మాత్రం అసలు ఆసక్తి చూపించలేదని, సున్నితంగా రిజెక్ట్ చేసాడని టాక్. ఎందుకంటే మంచి పవర్ ఫుల్ పాత్రనే, కానీ నిడివి చాలా తక్కువ ఉంటుంది. పైగా మొదటి నుండి అమీర్ ఖాన్ తన పాత్ర ఆరంభం నుండి చివరి వరకు ఉంటేనే చేసే మనస్తత్వం ఉన్న మనిషి. ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ వేయడానికి ఇష్టం చూపించడు. కూలీ చిత్రం లో కూడా కేవలం ఆయన రజినీకాంత్ రిక్వెస్ట్ మీద చేసాడు.

అంతే కాకుండా ఈ ఖాన్స్ త్రయం మొత్తం ధురంధర్ చిత్రం తీసినందుకు డైరెక్టర్ ఆదిత్య డర్ పై కోపంగా ఉన్నారని, అందుకే వీళ్ళు ఇప్పటి వరకు ఈ సినిమాపై స్పందించలేదని ఒక ప్రచారం బాగా జరుగుతోంది. ఎందులకంటే వీళ్లకు పాకిస్థాన్ ని విలన్ గా చేసి చూపిస్తే నచ్చదు, వాళ్ళ సినిమాలు ఆ దేశం లో విడుదలై మంచి వసూళ్లను రాబడుతాయి కాబట్టి, వాళ్లకు ఆ దేశం లో అభిమానులు కూడా భారీ రేంజ్ లో ఉన్నారు కాబట్టి , ఇలాంటి సినిమాలకు వాళ్ళు వ్యతిరేకం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నేడు అమీర్ ఖాన్ ఈ సినిమా సక్సెస్ సాధించడం పై తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మేకర్స్ ని శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇది మనస్ఫూర్తిగా తెలిపిన శుభాకాంక్షలు కావని, ప్రతీ రోజు సోషల్ మీడియా నుండి ఎదురు అవుతున్న వ్యతిరేకతను చూడలేకనే ఇలా బలవంతంగా రెస్పాన్స్ ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version