Naga Chaitanya Custody movie : ఒక్క పాట కోసం 7 సెట్స్.. నాగచైతన్య కోసం అంత రిస్క్ అవసరమా!

Naga Chaitanya Custody movie : ప్రస్తుతం అక్కినేని హీరోలలో ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పర్చుకుంది అక్కినేని నాగ చైతన్య మాత్రమే. అఖిల్ ఇండస్ట్రీ కి వచ్చి ఇన్నేళ్లు అయినా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు.ఇక అక్కినేని నాగార్జున కి వయస్సు అయ్యిపోయింది, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి, మార్కెట్ మొత్తం పోయింది.అలాంటి టైములో వరుసగా సూపర్ హిట్స్ కొట్టి ఆ ఫ్యామిలీ లెజసీ మోస్తున్నాడు నాగ చైతన్య. అయితే ఆయనకీ కూడా రీసెంట్ […]

Written By: NARESH, Updated On : February 16, 2023 10:35 pm
Follow us on

Naga Chaitanya Custody movie : ప్రస్తుతం అక్కినేని హీరోలలో ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పర్చుకుంది అక్కినేని నాగ చైతన్య మాత్రమే. అఖిల్ ఇండస్ట్రీ కి వచ్చి ఇన్నేళ్లు అయినా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు.ఇక అక్కినేని నాగార్జున కి వయస్సు అయ్యిపోయింది, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి, మార్కెట్ మొత్తం పోయింది.అలాంటి టైములో వరుసగా సూపర్ హిట్స్ కొట్టి ఆ ఫ్యామిలీ లెజసీ మోస్తున్నాడు నాగ చైతన్య.

అయితే ఆయనకీ కూడా రీసెంట్ గా ‘థాంక్యూ’ అనే డిజాస్టర్ ఫ్లాప్ తగిలింది.క్లోసింగ్ లో ఈ చిత్రం కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయింది..దీనితో నాగ చైతన్య తన తదుపరి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.తమిళం లో రీసెంట్ గానే ‘మానాడు’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో ఫామ్ లోకి వచ్చిన డైరెక్టర్ వెంకట్ ప్రభు తో ప్రస్తుతం ఆయన ‘కస్టడీ’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రం లో నాగ చైతన్య కి జోడిగా ఉప్పెన ఫేమ్ ‘కృతి శెట్టి’ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే నాగ చైతన్య కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది.నాగ చైతన్య మరియు కృతి శెట్టి మధ్య ఒక సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.ఈ పాట కోసం దాదాపుగా 7 సెట్లు వేసారట.అందుకు దాదాపుగా 5 కోట్ల రూపాయిల వరకు ఖర్చు అయ్యిందట.

భారీ డిజాస్టర్ ఫ్లాప్ తో డౌన్ లో ఉన్న ఉన్న నాగ చైతన్య పై ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఎందుకు రిస్క్ చేస్తున్నారంటూ టాలీవుడ్ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు.నాగ చైతన్య కి ప్రస్తుతం ఉన్న మార్కెట్ 30 నుండి 35 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది.కానీ ఈ సినిమా బడ్జెట్ చేతులు దాటిపోయిందని తెలుస్తుంది.సినిమా విడుదలయ్యాక కచ్చితంగా సూపర్ హిట్ టాక్ రావాల్సిందే.కాస్త అటు ఇటు అయినా మరో డిజాస్టర్ గా నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.