Gopichand : ఈ హీరోకి ఇక విలన్ పాత్రలే బెటర్ !

Gopichand: యాక్షన్ హీరో గోపీచంద్ కి ఇక విలన్ పాత్రలే బెటరా ? హీరోగా వరుసగా ప్లాప్ లు రావడంతో మార్కెట్ బాగా పడిపోయింది. ‘సిటీమార్’కి వచ్చిన ఆదరణ చూస్తూనే గోపీచంద్ పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. అయితే, గోపీచంద్ (Gopichand) కూడా ‘రానా’ లాగా నెగిటివ్ పాత్రలు చేస్తే బాగుంటుంది అని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. అత్యుత్తమ విలన్ పాత్రలు చేసిన అనుభవం గోపీచంద్ కి ఉంది. 2002లోనే జయం సినిమాలో విలన్ గా నటించి […]

Written By: admin, Updated On : September 17, 2021 6:00 pm
Follow us on

Gopichand: యాక్షన్ హీరో గోపీచంద్ కి ఇక విలన్ పాత్రలే బెటరా ? హీరోగా వరుసగా ప్లాప్ లు రావడంతో మార్కెట్ బాగా పడిపోయింది. ‘సిటీమార్’కి వచ్చిన ఆదరణ చూస్తూనే గోపీచంద్ పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. అయితే, గోపీచంద్ (Gopichand) కూడా ‘రానా’ లాగా నెగిటివ్ పాత్రలు చేస్తే బాగుంటుంది అని మేకర్స్ ఫీల్ అవుతున్నారు.

అత్యుత్తమ విలన్ పాత్రలు చేసిన అనుభవం గోపీచంద్ కి ఉంది. 2002లోనే జయం సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. నిజానికి ఆ సినిమా చేసినప్పుడు గోపీచంద్ కి 22 ఏళ్ళే , పైగా ఆయనకు అది రెండో సినిమా. ఇక మొట్టమొదటి సారి విలన్ గా చేసిన సినిమా. ఆ సినిమాకి గోపీచంద్ కి బెస్ట్ విలన్ క్యాటగిరి లో నంది అవార్డు కూడా వచ్చింది.

దాంతో తెలుగు సినిమా చరిత్రలో నంది అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ విలన్ గా గోపీచంద్ రికార్డు సాధించాడు. ఇప్పటికీ ఈ రికార్డు ఎవ్వరూ బద్దలు కొట్టలేదు. ఒక విధంగా అత్యంత క్రూరమైన విలన్ పాత్రకు గోపీచంద్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. జయం సినిమాలో విలన్ పాత్ర క్రూరమైన పాత్ర. ఆ పాత్రలో గోపీచంద్ నటించలేదు, జీవించేశాడు,

గట్టిగా భయంకరమైన డైలాగులను కూడా అంతే పవర్ ఫుల్ గా చెప్పడంలో గోపీచంద్ లో మంచి నేర్పు ఉంది. వాయిస్ లో స్పష్టత గట్టిదనం కొందరికే ఉంటుంది. అది గోపీచంద్ లో ఉన్నాయి. అందుకే విలన్ పాత్రలకు గోపీచంద్ అంత అద్భుతంగా సెట్ అవుతాడు.

ఆ వెకిలి నవ్వు , కోపం, గట్టిగా అరిచి మాట్లాడడం ఇదంతా విలనిజంలోని లక్షణాలు కాబట్టి.. ఆ లక్షణాలు గోపీచంద్ లో మెండుగా ఉన్నాయి కాబట్టి.. ఇప్పటికైనా పాన్ ఇండియా రేంజ్ లో విలన్ గా మారి తన నటనా పరిధిని గోపీచంద్ పెంచుకుంటాడేమో చూడాలి.